ఎప్పుడూ సైలెంట్ గా ఉన్న నాచురల్ స్టార్ నాని... ఒక్కసారిగా వైలెంట్ గా మారారు. ఏ విషయాలైన సరే... మనకెందుకు... పెద్దలున్నారు కదా అంటూ తప్పుకునే నానికి కూడా ఇప్పుడు కోపం వచ్చింది. అయితే ఆ కోపం... ఇండస్ట్రీ మీద కాదు. సినీ పరిశ్రమ పడుతున్న ఇబ్బందులు చూసి తట్టుకోలేక నాని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ప్రతి దానికి మేమే లోకువగా దొరుకుతామా... అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాని. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్న  వాటిని పట్టించుకోరు కానీ... సినిమా అనే సరికి బోలేడు ఆంక్షలు వస్తాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు సినిమా అంటే అంత చిన్న చూపు ఎందుకు అంటూ ప్రశ్నించారు. సినిమా అనేది ఒక కల్చర్ అని వ్యాఖ్యానించిన నాని... థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తే.. ఆ మజానే వేరన్నారు. రెస్టారెంట్స్, పబ్స్, పబ్లిక్ ప్లేస్ ల కంటే థియేటర్లు చాలా సేఫ్ అంటూ నాని కామెంట్ చేశారు. కానీ వాటినే ముందు మూస్తారు... లాస్ట్ లో తెరుస్తున్నారు... ఇదేమి న్యాయం అంటూ ప్రశ్నించారు.

భారతీయులు ఇంటి తర్వాత ఎక్కువ సమయం గడిపేది థియేటర్ లోనే అని నాని వెల్లడించారు. దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ లేదన్న నాని.... ఇది ఒ సగటు ప్రేక్షకుడిగా చెబుతున్నానన్నారు. సిని పరిశ్రమపై కోట్ల మంది ఆధారపడి బతుకుతున్నారని... అలాగే థియేటర్లపై లక్షల మంది జీవనం సాగిస్తున్నారన్నారు నాని. పరిస్థితులు ఇలాగే ఉంటే థియేటర్ వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుందంటూ నాని ఆవేదన వ్యక్తం చేశారు. వందల మంది మధ్య కూర్చుని థియేటర్ లో సినిమా చూడటం అనేది ఫ్యూచర్ జనరేషన్లకు కష్టమే అన్నారు. అందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని నాని విజ్ఞప్తి చేశారు. తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని... పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు కూడా ఓటీటీ వైపు చూస్తున్న నేపథ్యంలో నాని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: