టాలీవుడ్ సినిమా పరిశ్రమలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు రాగా అందులో ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. ఆ విధంగా టాలీవుడ్ లో రాయలసీమను నమ్ముకొని అందరూ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. కానీ ఈ మధ్య కాస్త ఆ ట్రెండ్ తగ్గింది. ఆ తరువాత చాలా రోజులకు ఇప్పుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వస్తుండడం గమనార్హం. ఇటీవలే విడుదలైన నారాప్ప సినిమాలో రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ ఎంచుకున్నారు. అయితే  గత సినిమాల లాగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

గతంలో కూడా వెంకటేష్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను చేసి ఎంతగానో అలరించారు. ప్రేమించుకుందాం రా సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రాగా ఆయన నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవినీ కూడా రాయలసీమ ఏమాత్రం నిరాశ పరచలేదు. ఆయన హీరోగా చేసిన ఇంద్ర సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నే తెరకెక్కగా ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇప్పటికీ చెరిగిపోని ఆ రికార్డులను చూస్తేనే తెలుస్తుంది. 

ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కిస్తున్న లూసిఫర్ రీమేక్ కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందట. యాక్షన్ సినిమాలకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఆద్యుడు బాలకృష్ణ ఈ సినిమాలు చేసే స్టార్ హీరోగా ఎదిగాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమ సింహం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. పవన్ కళ్యాణ్ సైతం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో అయ్యప్పనుం కొషియం రీమేక్  సినిమాను చేస్తున్నారు. ఈ విధంగా వరుసగా తెలుగులో లో పెద్ద పెద్ద స్టార్లు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడంతో మళ్లీ రాయలసీమ జోరు మొదలవుతుంది అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: