తెరమీద ఆయన విలన్. కానీ, నిజజీవితంలో హీరో అని ప్రతీ ఒక్కరు చెప్పుకునే పేరు సోనుసూద్ అనడంలో ఎలాంటి అతశయోక్తి లేదు. కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తున్న సమయంలో, దేశం మొత్తం సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భంలో తన వంతు సాయం చేస్తూ ప్రజలకు సాంత్వన కలిగించిన వ్యక్తి సోనుసూద్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆపదలో ఆదుకునేందకు ప్రయత్నించారు సోను. కాగా, సోను పర్సనల్ లైఫ్ ప్లస్ ప్రొఫెషనల్ బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే దర్జీగా, మిల్క్ మ్యాన్‌గా అవతారమెత్తాడు. అందుకు సంబంధించిన వీడియోలు తన ఇన్ స్టా వేదిక సోను షేర్ చేయగా, నెట్టింట అవి ట్రెండయ్యాయి. తాజాగా సోను మరో అవతారమెత్తాడు. అదేంటంటే..

ఇలా రకరకాల అవతారాల్లో ఆయన కనిపించడానికి కారణం ఉంది. దేశీయంగా ఉన్న వృత్తులు, స్మాల్ బిజినెసెస్ అన్నిటినీ ప్రజలు ఆదరించాలని, తద్వారా వారికి చేయూతనివ్వొచ్చని చెప్పడమే సోనుసూద్ ఉద్దేశం. హెయిర్ స్టైలింగ్ లో మెళకువలు ఇవి అంటూ సోను ఓ వీడియో షేర్ చేశాడు. కేశాల సంరక్షణ కోసం దాదాపు ప్రతీ ఒక్కరు చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే హెయిర్ స్టైలింగ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్ అని సోను తెలిపాడు. హెయిర్ స్టైల్‌గా సెట్ చేయడం, చేసుకోవడం దాని గురించి ఇతరులకు చెప్పడం నాకు ఇష్టమని తెలిపాడు సోను. ఈ విషయాలన్నీ చెప్తూనే బట్టతల ఉన్న వ్యక్తి హెయిర్ స్టైలింగ్ సోనుసూద్.  సపోర్ట్ స్మాల్ బిజినెస్, సపోర్ట్ లోకల్ స్టఫ్, హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్ అనే హ్యాష్ ట్యాగ్స్‌తో వీడియోను సోను షేర్ చేయగా, అది చూసి నెటిజన్లు సోనుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోను తెర మీద నటుడు మాత్రమే కాదని, భారత ప్రజల హృదయాల్లో నిలిచిపోయే రియల్ హీరో అని నెటిజన్లు సోనును తెగపొగిడేస్తున్నారు. సోను సినిమాలు చేస్తూనే ఇన్ని సామాజికి సేవాకార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు చెప్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: