లేటెస్ట్ అప్డేట్స్ కోసం అటు మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్ తోపాటు దగ్గుపాటి అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతే కాదు వీరితో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఇది. అదే మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కోషియుమ్..ఈ సినిమాలో రాణా - పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ కలసి నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పేరు భీమ్లా నాయక్..ఇక ఈ పేరుతో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఇక విషయం తెలిసిన పవన్ అభిమానులు ఈ పేరును సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు.


ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ తో కలిసి రానా షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. "పవన్ కల్యాణ్ వ్యక్తిత్వానికి, ఎక్స్పీరియన్స్ కి తప్పకుండా గౌరవం ఇవ్వాల్సిందే. అంతే కాదు సెట్ లో అందరితో సమానంగా ఉంటారు. ఇక షూటింగ్ విరామ సమయంలో  అందరితో సంతోషంగా ఉంటూ, జోకులు కూడా వేస్తుంటారు. ఆయనకు సినీఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉంటే తప్ప అంత చక్కగా నటిస్తారు.


అయినా పవన్ కళ్యాణ్ తో కలసి నేను నటిస్తున్నానని ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను. అంతే కాదు ఆయన తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. ఇక ఆయన నుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఆయన అనుభవం లో నా అనుభవం చాలా చిన్నది. ఈయన అనుభవాలను, జీవితాన్ని ఒక పుస్తకం కూడా రాయొచ్చు. అంతేకాదు పవన్ అంటేనే ఒక పుస్తకం. ఒక పుస్తకం చదివిన ప్రతిసారీ కొత్త విషయాలను తెలుసుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ తో ఉన్న ప్రతి సారి ఏదో ఒక అనుభూతిని పొందుతారు అని పవన్ కళ్యాణ్ పై " ప్రశంసల వర్షం కురిపించాడు రాణా.


మరింత సమాచారం తెలుసుకోండి: