ఆమెకు అందం ఉంది. అభినయమూ ఉంది. కానీ లక్ మాత్రం చాలా దూరంగా ఉంది. అందుకే ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్ళు గడుస్తున్నా కూడా స్టార్ హీరోయిన్ రేసులో కాదు కదా హీరోయిన్ గా కూడా పెద్దగా బిజీగా లేదు. ఆమె ఎవరో కాదు అందాల రాక్షసి లావణ్యా త్రిపాఠి.

లావణ్యా త్రిపాఠి  తొలి మూవీ అందాల రాక్షసి మంచి హిట్. ఆ తరువాత కొన్ని సినిమాలు బాగానే ఆడాయి. భలె భలే మొగాడివోయ్ మూవీ కూడా హిట్ అయింది. అయితే ఆమె సీనియర్ హీరో నాగార్జున పక్కన ఆ టైమ్ లో చేసిన సోగ్గాడే చిన్న నాయన మూవీయే కేరీర్ ని కొంత రివర్స్ చేసింది అంటారు. ఈ మూవీ కూడా సూపర్  హిట్టే. కానీ ఆమె సీనియర్ హీరోతో నటించడం వల్లనే యంగ్ హీరోస్ ఎవరూ ఆమె జోలికి పోలేదు అంటారు.

ఆ తరువాత కూడా ఆమె ఎంచుకున్న సినిమాలు రాంగ్ జడ్జిమెంట్స్ తో ఫ్లాప్స్ గా మిగిలాయి. దాంతో లావణ్య కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే  అన్నట్లుగానే ఉండిపోయింది. ఇదిలా ఉంటే లావణ్యా త్రిపాఠీకి ఈ మధ్య నిఖిల్ మంచి హిట్ ఇచ్చారు. అర్జున్ సురవరం మూవీతో ఆమె మళ్ళీ నిలదొక్కుకుంటుంది అని అంతా భావించారు. ఇక  లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద వచ్చిన చావు కబురు చల్లగా హిట్ అయి తీరుతుంది అనుకుంటే ఫట్ అయింది.

దీంతో మూవీస్ లేక డల్ అయిన లావణ్యా త్రిపాఠీకి మంచు ఫ్యామిలీ ముంచి పిలుపు వచ్చిందని అంటున్నారు. మంచు మనోజ్ నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ అహం బ్రహ్మస్మి మూవీలో లావణ్యకు హీరోయిన్ వేషం దక్కిందట. ఈ మూవీలో లావణ్య జర్నలిస్ట్ గా అతి ప్రధాన‌మైన పాత్రలో కనిపిస్తుంది అంటున్నారు. ఈ మూవీ మీద మంచి అంచనాలు కూడా ఉన్నాయి. దాంతో లావణ్యకి ఈ ఆఫర్ ఒక విధంగా లక్కే అంటున్నారు. మొత్తానికి అందాల రాక్షసికి అహం బ్రహ్మస్మి సెకండ్ ఇన్నింగ్స్ కి కొత్త దారి చూపిస్తుందేమో అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: