ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌పైనే పోరాటానికి సిద్ధమైంది ఓ హీరోయిన్. మీరు చదివింది నిజమేనండోయ్.
అగ్రిమెంట్ కండిషన్స్‌ను బ్రేక్ చేసినందుకు గాను సదరు హీరోయిన్ కోర్టు‌ను ఆశ్రయించబోతున్నది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఆమె నిర్మాణ సంస్థపై పోరాటం ప్రకటించింది? ఈ కథనం చదివి మీరూ తెలుసుకోండి. 

ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా గుర్తింపు పొందిన ఆమె పేరు స్కార్లెట్ జాన్సన్. హాలీవుడ్ ఫేమస్ యాక్ట్రెస్ అయిన ఈమె నటించిన సినిమా వచ్చిందంటే చాలు ప్రతీ ఒక్కరు చూడాల్సిందేనట. కాగా, స్కార్లెట్, ఫేమస్ ప్రొడక్షన్ హౌజ్ డిస్నీ హాట్ స్టార్ మధ్య ఓ ఒప్పందం కుదరింది. అదేంటంటే..ఆమె నటించిన ‘బ్లాక్ విడో’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాతనే డిజిటల్ బాట పట్టాలి. కానీ, ఆ నిబంధనను అతిక్రమించి డిస్నీ హాట్‌స్టార్ ఒకేసారి థియేటర్లతో పాటు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయం పట్ల స్కార్లెట్ తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలా ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఓటీటీల్లో ఒకేసారి విడుదల చేస్తే..థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయం ఆటో‌మేటిక్‌గా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె డిస్నీ హాట్‌స్టార్ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. ఈ విషయమై లా సూట్ వేసింది. దీనిపై డిస్నీ హాటస్టార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కరోనా వల్ల సినీ రంగంతో పాటు ఇతర రంగాలన్నీ లాస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే డిస్నీ హాట్ స్టార్ తన నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘బ్లాక్ విడో’ మూవీని థియేట్రికల్ ప్లస్ డిజిటల్ రిలీజ్ చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. కాగా, ఇలా చేయడం వల్ల స్కార్లెట్‌కు నష్టం వస్తుందనే విషయం ఎందుకు ఆలోచించలేకపోయిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో హాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమాలు దాదాపుగా డిజిటల్ బాట పట్టాయి. థియేట్రికల్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లేనే ఓటీటీల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: