ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతుందో, ఎవ‌రిపై కామెంట్ చేస్తుందో తెలియ‌దు ఈ అమ్మడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి అల్లు అర్జున్ ఇలా అనేక మంది న‌టుల‌పై కూడా తీవ్రంగా కామెంట్లు చేసింది ఆమె శ్రీ‌రెడ్డి. ఎల్ల‌ప్పుడు సోష‌ల్ మిడియాలో యాక్టివ్‌గా ఉంటూ అన్నిటికి స్పందిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కామ్‌గా ఉంటుందో ఎప్పుడు మాట‌ల బాంబులు పేలుస్తుందో తెలియ‌దు ఈ బోల్డ్ అమ్మాయి. సినిమా వాళ్ల‌నే కాకుండా రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా టార్గెట్ చేసి కామెంట్లు చేస్తు ఓ ఆటాడుకుంటుంది.

  క్యాస్టింగ్ కౌచ్ జ‌రిగిందంటూ ఉద్య‌మాన్ని లేవ‌నెత్తిన ఈ న‌టి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. అనేక సార్లు వివాదాల్లో కూడా చిక్కుకుంది.  అయితే, శ్రీ  రెడ్డికి పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న ఏ మాత్రం లేద‌ని, ఎవ‌రైనా త‌న‌ను అర్థం చేసుకునే వాడు దొరికితే హ్య‌పి అని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వూలో యాంకర్ అడిగిన ప్ర‌శ్న‌కు ఈ విధంగా స‌మాధానం ఇచ్చింది.


త‌న‌కు ఎక్కువ శాతం మ‌గ స్నేహితులు ఉన్నార‌ని, అమ్మాయిలతో పాటు ట్రాన్స్ జెండ‌ర్స్ లో కూడా త‌న‌కు మంచి మిత్రులు ఉన్నార‌ని చెప్పుకొచ్చింది. పైగా వారితో ఉంటే సెక్యూర్‌గా ఫీల్ అవుతానని ఈ సంద‌ర్భంగా వివ‌రించింది. త‌న‌కు ఏం జ‌రుగుతుందోన‌ని భ‌యప‌డ‌కుండా, ఎవ‌రికి భ‌య‌ప‌డ‌కుండా ముందుకు వెళ్లాల‌ని చెప్పింది ఈ సంచ‌ల‌న తార‌.


  ఇటీవ‌ల త‌మిళ‌నాడులో ఎమ్మెల్యేగా గెలిచిన ఉద‌య్ నిధి స్లాలిన్‌ను అభినందించింది. ఆయ‌న గెల‌వ‌డం త‌మ‌కెంతో మంచిది అంటూ పోస్ట్ కూడా చేసింది. టాలీవుడ్‌లో అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో అనేక మందిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి టాలీవుడ్ ఫిల్మ్ ఎదుట అర్ధ‌న‌గ్నంగా ఆమె చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. స్టేట్ మీడియాతో పాటు నేష‌న‌ల్ మీడియా కూడా ఈ త‌తంగాన్ని క‌వ‌ర్ చేసింది. సోష‌ల్ మీడియాలో ఈ వార్త చాలా రోజుల పాటు వైర‌ల్ అయింది కూడా. దీని త‌రువాత త‌మిళ‌నాడుకు వెళ్లిన ఈ బొల్డ్ బాంబ్ అక్క‌డే ఉంటుంది. అక్క‌డ కూడా పెద్ద‌గా అవ‌కాశాలు లేక‌పోగా అక్క‌డ ఉన్న న‌టులు, రాజ‌కీయ నాయ‌కుల‌పై కూడా కామెంట్లు చేస్తోంది. గ‌తంలో ఉదయ్ నిధి స్టాలిన్ త‌న‌తో ప‌డుకున్నాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈటీవ‌ల ఎమ్మెల్యేగా ఉద‌య్‌నిధి గెల‌వ‌డంతో ఫ్లేట్ ఫిరాయించి పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది.

   

మరింత సమాచారం తెలుసుకోండి: