ఒలంపిక్ రజత పతక విజేత మీరాభాయ్ ఛాను ఇప్పుడు ఈ పేరు తెలియని భారతీయులు లేరు అంటే అతిశయోక్తి అవసరం లేదు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి.. తన స్వశక్తితో, ఆత్మవిశ్వాసంతో వెయిట్ లిఫ్టర్ గా ఎదిగింది మీరా. తన అత్యుత్తమమైన ప్రతిభతో రాష్ట్రస్థాయిలో, దేశ స్థాయిలో ఎన్నో పథకాలను గెలుచుకుంది. తాజాగా ఆమె మరో గొప్ప అద్భుతమైన ఘనత సాధించింది. తాజాగా జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో ఆమె భారత్ కు తొలి పతకాన్ని సాధించి పెట్టింది. 49 కేజీల విభాగంలో ఆమె రజత పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా మీరాబాయి పై ప్రశంశల వర్షం కురిసింది. అంతేకాదు టోక్యో నుండి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మీరాబాయికి ఘన స్వాగతం లభించింది. ఇది మాత్రమే కాకుండా మిజోరాం ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ పదవిని కూడా ఇచ్చింది.


 ఇక మిజోరాం లోని తన స్వగృహానికి చేరుకున్న మీరాబాయి తను ఇంతకు ముందు ఎలా అయితే జీవించేది అలానే తన జీవనాన్ని కొనసాగిస్తోంది. ఒలంపిక్స్ లో పతకం గెలిచాను అన్న గర్వం ఏ మాత్రం లేకుండా సాధారణమైన జీవితాన్ని గడుపుతుంది. తాజాగా మీరాబాయి నేలపై కూర్చొని భోజనం చేస్తున్న  ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన వారంత ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒలంపిక్ లో గెలిచాను అన్న గర్వం ఏ మాత్రం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న అందుకు మామూలు జనాలతో పాటు సెలబ్రిటీల నుండి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కానీ నటుడు మాధవన్ ఈ ఫోటో పై చేసిన కామెంట్లు మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఈ పిక్ పై స్పందించిన మాధవన్.. అసలు ఇది నిజమేనా..నేను నమ్మడం లేదు. అంటూ పేర్కొన్నారు. ఇలా కామెంట్ చేయడం వెనక ఆయన అంతరార్థం మరొకటి ఉంది. ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోయినా మహిళలు ఇలాగే దృఢసంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి అనేది ఆయన ఉద్దేశం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో లో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: