శ్రీ విష్ణు.. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అవుతున్న హీరో . మొదట సోలో, బాణం అనే సినిమాల ద్వారా చిన్న పాత్రలతో సినీ ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగు పెట్టాడు. శ్రీ విష్ణు తర్వాత 2013వ సంవత్సరంలో వచ్చిన" ప్రేమ ఇష్క్ కాదల్" అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తర్వాత 2014 సంవత్సరంలో హీరో నారా రోహిత్ హీరోగా వచ్చిన " ప్రతినిధి" సినిమాలో శ్రీ విష్ణు హోంమంత్రి కుమారుడిగా నటించాడు. అలాగే తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించాడు. ముఖ్యంగా చెప్పుకోవలసిన సినిమాలు ఏమిటంటే, అప్పట్లో ఒకడుండేవాడు, జయమ్ము నిశ్చయమ్మురా, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కదా, వీర భోగ వసంత రాయలు అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..

ఇకపోతే ఇటీవల శ్రీ విష్ణు సినీ కెరియర్ కొంచెం చతికిలపడింది అనే చెప్పవచ్చు. 2019 లో వచ్చిన బ్రోచేవారెవరురా, తిప్పరామీసం వంటి సినిమాల ద్వారా కొంచెం ఫ్లాప్ ను చవి చూసిన శ్రీ విష్ణు, ఇప్పుడు మరోసారి గాలి సంపత్  సినిమా ద్వారా హీరోగా వచ్చి,  రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మరోసారి రాజ రాజ చోర అనే సినిమా ద్వారా తిరిగి సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెడుతున్నాడు.

ఇక ఈ సినిమా గత కొద్ది రోజుల నుండి ప్రమోషన్స్ ను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మేఘ ఆకాష్ ఎంపికైనట్లు సమాచారం.ఈ చిత్రం యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రమోషన్స్ పై ఇప్పటి వరకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి ఒక టీజర్ ను విడుదల చేయగా  మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇందులో దొంగ గా కనిపిస్తూనే మరోపక్క సాఫ్ట్ వేర్  ఇంజనీర్ అని జనాలను మోసం చేస్తున్నట్లు శ్రీ విష్ణును చూపిస్తారు. ఇక ఇందులో రవిబాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈసారి కచ్చితంగా శ్రీ విష్ణు హిట్ కొడతాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: