తెలుగులో ఆకట్టుకున్న చిన్న సినిమాలే కాదు ఇతర భాషల్లో మంచి మూవీ అనిపించినా వాటిని కనిపెట్టడంలో మన స్టైలిష్ స్టార్ ముందుంటారు. ఈ ఇయర్ ఏప్రిల్ లో మార్టిన్ ప్రక్కట్ డైరక్షన్ చేసిన మళయాళ మూవీ నయట్టు సూపర్ హిట్ అయ్యింది. కుంచకో బోబెన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ సినిమా మళయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. అక్కడ హిట్టైన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయాలని చూస్తున్నారు.

తెలుగులో నయట్టు రీమేక్ ను అల్లు అర్జున్ చేస్తున్నట్టు టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ రీమేక్ జరుగనుంది. నయట్టు రీమేక్ లో ఎవరెవరు నటిస్తారు. ఈ సినిమాను తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ కు నచ్చి ఈ మూవెని తెలుగులో రీమేక్ చేయాలని భావించారట. బన్నీ మనసు గెలిచింది అంటే తప్పకుండా మూవీలో ఏదో స్పెషల్ ఉండే ఉంటుందని అంటున్నారు. అయితే బన్నీ తన స్పెషల్ ఇంట్రెస్ట్ మీద ఈ మూవీ నిర్మిస్తున్నారని టాక్. పేరు గీతా ఆర్ట్స్ దే అయినా అల్లు అర్జున్ దగ్గర ఉండి ఈ రీమేక్ వ్యవహారాలు చూస్తారని టాక్.

ఇక హిందీలో నయట్టు మూవీని జాన్ అబ్రహం రీమేక్ చేస్తారని ప్రకటించారు. జాన్ అబ్రహం సొంత నిర్మాణంలో ఈ మళయాళ మూవీ రీమేక్ జరుగుతుంది. మొత్తానికి మరో మళయాళ సినిమాకు నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. నయట్టు మూవీ పై అల్లు అర్జున్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ మూవీని తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారు ఆ మూవీ విశేషాలు ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. పుష్ప మూవీతో బిజీగా ఉన్న బన్నీ నయట్టు రీమేక్ కి కూడా ప్లాన్ చేస్తున్నారు.  
   

మరింత సమాచారం తెలుసుకోండి: