సుమన్ 1990వ దశకంలో తెలుగు సినిమా రంగంలో దూసుకువచ్చిన యువకెరటం. అంతే కాదు అంతకు మించి అందగాడు... గుణవంతుడు కూడా..! సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన పని తాను చేసుకోవడం తప్ప ఎక్కువగా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు.. అన్నంత మంచి పేరు తెచ్చుకున్నారు. కరాటే కింగ్ ఆయన సుమన్ కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయింది. ఆ సమయంలో టాలీవుడ్ లో నాలుగు బలమైన ఫ్యామిలీల నుంచి స్టార్ హీరోలు గా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి - యువరత్న నందమూరి బాలకృష్ణ - మన్మధుడు అక్కినేని నాగార్జున - విక్టరీ వెంకటేష్ లాంటి హీరోలకు పోటీగా నిలిచాడు. ఒక టైంలో ఈ నలుగురు హీరోలను మించి కూడా సుమ‌న్ ఎదుగుతాడు అన్న టాక్‌ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.

సుమన్ రూపంతో పాటు అందం కూడా మహిళా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో ఉన్న సుమన్ తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ తర్వాత నెంబర్ వన్ హీరో అవుతారని చాలామంది భావించారు. మ‌హిళా ప్రేక్ష‌కులు సుమ‌న్ బాడీని చూసేందుకు ఆయ‌న సినిమాల కోసం ప‌దే ప‌దే థియేట‌ర్ల‌కు వ‌చ్చేవార‌ని అంటారు. సుమ‌న్ ఎదుగుద‌ల చూసి కొందరు పెద్దలు కన్ను కుట్టింది. ఎలా అయినా సుమన్‌ను అణ‌గ‌దొక్కాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సుమ‌న్‌ను లేనిపోని కేసుల్లో ఇరికించడం తో ఆయ‌న భవిష్యత్తు ఒక్కసారిగా కుప్పకూలింది.

ఆ తర్వాత సుమన్ తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నా మునుపటి క్రేజ్ అయితే లేదు. దానికి నాడు స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఓ బడా ఫ్యామిలీకి చెందిన వాళ్లంతా కలిసి పన్నిన కుట్రలో సుమ‌న్‌ బలయ్యారన్న టాక్‌ అయితే ఉంది. మరి ఇందులో వాస్తవ వాస్తవాలు ఏమిటో వారికే తెలియాలి. ఏదేమైనా సుమ‌న్‌కు వ‌చ్చిన రేంజ్ క్రేజ్‌లో ఆయ‌న ఎద‌గ‌లేకపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: