టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నా కూడా హీరోయిన్లుగా నెట్టుకు రాలేక పోతున్నారు. అలాంటి వారు ఏ ఇండస్ట్రీలో అయినా చాలామంది ఉంటారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అలాంటి పేర్లలో అర్చన కూడా ఒకటి. అయితే ఈమెకు వివాహం అయిన తర్వాత తన భర్త గురించి ఒక విషయం తెలిసింది ఆ విషయం ఏమిటో చూద్దాం.

ఈమె అసలు పేరు అర్చన శెట్టి. ఈమె తపన అనే సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అల్లరి నరేష్ తో కలిసి నేను అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా అర్చనకు ప్రేక్షకుల నుంచి  బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈమె  తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు.

ఇక దీంతో బిగ్ బాస్ షో లో మొదటి సీజన్ లో ఈమె పాల్గొంది. ఇక గత సంవత్సరం వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. ఇక తన భర్త కూడా ఒక హెల్త్ కేర్ కంపెనీకి చైర్మన్ గా  వ్యవహరిస్తున్నాడు. అతని పేరు జగదీష్. అర్చన ఇటీవల కాలంలో, ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూలో తన భర్త గురించి కొన్ని విషయాలను తెలిపింది.

వివాహం తర్వాత తన భర్తకు ఉన్న అలవాట్లను చూసి ఆశ్చర్యపోయాను అని చెప్పుకొచ్చింది. తన భర్త ఎప్పుడు చూసిన మొబైల్లో"రమ్మీ గేమ్"(పేకాట) ఆడుతూ ఉంటాడని తెలిపింది. ఈ విషయంపై నేను చాలాసార్లు కోప్పడ్డాను అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తను బాత్రూం వెళ్ళినా కూడా గంటలకొద్దీ అక్కడే ఉంటాడు అని చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి అని నాకు తెలియదని చెప్పుకొచ్చింది.

కొన్ని సార్లు ఈ అలవాటు వల్ల తనకు చాలా చిరాకు వచ్చేదని అర్చన సరదాగా తెలుపుతూ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: