బాలీవుడ్ స్టార్ సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి సమయంలో ఎన్నో సేవలు చేసి రియల్ హీరో గా సోనుసూద్ మారిపోయారు. మొదటి వేవ్ కరోనా మహమ్మారి సమయం నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సోనుసూద్ ఏదో రూపంలో సహాయం చేస్తూనే ఉన్నాడు. కరోనా సమయంలో దేశంలో ఉన్నటు వంటి  వలస కార్మికులకు రియల్ హీరో సోనుసూద్ ఎవరూ చేయని సహాయం చేశారు.  వలస కార్మికులను తమ తమ ప్రదేశాలకు చేర్చడానికి ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు సోనూసూద్. 

అలాగే... ఉపాధి కోల్పోయిన వారికి కూడా తగినంత సహాయం అందించారు. అక్కడితో ఆగకుండా... ట్విట్టర్ వేదికగా ఎవరు సహాయం కోరినా... తన ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాడు సోను సూద్. కరోనా బాధితుల కోసం మొన్నటి వరకు ఆక్సిజన్ ను కూడా అందించాడు. ఆక్సిజన్ కొరత ఉన్న నేపథ్యంలో.... తన ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేశాడు సోను సూద్. ఇక తన ఫౌండేషన్ ద్వారా.... సినీ ప్రముఖులు మరియు ఇతర స్టార్లకు కూడా ఆక్సిజన్ అందించి... రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.

 అయితే ఇది ఇలా ఉండగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సోనూసూద్. పేద విద్యార్థుల కోసం... కొత్త ఆఫర్ ను ప్రకటించాడు సోనుసూద్. యూనివర్సల్ ఎడ్యుకేషన్ సహాయం తో సోనూసూద్ కు చెందిన చారిటీ ఫౌండేషన్ ద్వారా ముంబై నగరంలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, బీఈడీ, ఆర్కిటెక్చర్ వంటి ఇతర అ కోర్సులను ఫ్రీగా పేద విద్యార్థులకు అందిస్తామని సోను సూద్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇందుకోసం అం చారిటీ పౌండేషన్ ద్వారా అప్లై చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు సోనూసూద్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా... ఓ పోస్ట్ కూడా చేశాడు. ఇక సోనూసూద్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు ఊరట లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: