దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు గా అజయ్ దేవగన్ , సముద్రకని ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్' . రాజమౌళి, రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లొ సినిమా అనగానే జనాలలో ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో పెరిగిపోయాయి. దానికి ప్రధాన కారణం ఇప్పటికే రాజమౌళి , రామ్ చరణ్ కు 'మగధీర' లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడం, మరియు జూనియర్ ఎన్టీఆర్ కు స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి , యమదొంగ వంటి బ్లాక్ బాస్టర్ లు అందించడమే. ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా దేశంలో కరోనా పలు దశలుగా విజృంభించడం వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ , అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ , కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలో పోషిస్తోన్న పాత్రలకు సంబంధించిన ప్రోమో లను ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి స్పందనను తెచ్చుకున్నాయి. మరియు సినిమా ప్రమోషన్ ల జోరు పెంచే క్రమంలో ఈ మధ్యే 'దోస్తీ' అనే ఒక ప్రమోషనల్ సాంగ్ ను ఇండియా వ్యాప్తంగా విడుదల చేశారు.

అలాగే సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా దసరాకు విడుదల కావడం కష్టమే అని అనేక వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దసరాకు సినిమాను తీసుకు వస్తాడు అనే ఉద్దేశంతో తెలుగు ఇండస్ట్రీ బడ హీరోలు  తమ సినిమా విడుదల తేదీలను దసరాకు కాకుండా సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు రాజమౌళి కూడా  'ఆర్ఆర్ఆర్' సినిమాను కూడా సంక్రాంతి బరిలో ఉంచాలని  ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం నుండి మాత్రం ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఆఫీషియల్ ప్రకటన రాలేదు. ఒకవేళ  'ఆర్ఆర్ఆర్' సినిమా దసరాకి కాకుండా సంక్రాంతికే విడుదల అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న హీరోలు పోటీ ఎందుకులే అనుకుని వెనక్కి తాగుతారో..లేకపోతే 'ఆర్ఆర్ఆర్' తో పాటే పోటీలో ఉంటారో..తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr