
ఒక్కోసారి హీరో కంటే విలన్ గొప్ప నటుడు అయితే, ఇక ఆ హీరో పరిస్థితి అధోగతే. తెలుగు సినిమా చరిత్రలో తమ నటనతో హీరోలను తొక్కేసి ఘనమైన ఖ్యాతి గడించిన విలన్లు చాలామంది ఉన్నారు. వాళ్లెవరో చూద్దాం. 'సంపూర్ణ రామాయణం' చిత్రంలో ఎస్వీయార్ గారు రావణాసురుడి
'ముత్యాల ముగ్గు' చిత్రంలో రావుగోపాలరావుది పక్కా విలన్ పాత్ర. నిజానికి ఆ సినిమాలో శ్రీధర్ అనే హీరో ఉన్నాడు. 'బాపు గారి దర్శకత్వంలో మొదటిసారి హీరోగా నటిస్తున్నాను, ఇక నాకు హీరోగా సినిమాలు వస్తాయి' అంటూ అప్పట్లో శ్రీధర్ ఎంతో ఆనందించాడు. కానీ రావు గోపాలరావు విలనీజం ముందు, శ్రీధర్ హీరోగా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అలాగే 'ఇంట్లో రామయ్య వీధిలో కష్ణయ్య' సినిమాలో నిజానికి హీరో చిరంజీవి. కానీ ఆ సినిమాలో చిరుకి పెద్దగా పేరు రాలేదు. కారణం గొల్లపూడి మారుతీరావు. ఆ సినిమాలో ఆయన పాత్ర అంత గొప్పగా ఉంటుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించిన చాలా సినిమాలలో హీరోల పరిస్థితి అదే.
ఇక 'పున్నమినాగు' చిత్రంలో హీరో నరసింహరాజు, చిరంజీవి ఒక విలన్. కానీ, మెగాస్టార్ తన నటనతో హీరోని తొక్కేసి తన విలనిజాన్నే హీరోయిజాన్ని చేసేసారు. అదేవిధంగా 'అంతఃపురం' చిత్రంలో విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ కూడా ఆ సినిమాలో హీరోలకు పేరు రాకుండా, తన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు.