పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు మామూలుగా లేదు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సంవత్సరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన 'వకీల్ సాబ్' సినిమాతో బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ కొట్టి , కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనున్ కోషియన్'  సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న 'భీమ్లా నాయక్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తో పాటు మరో హీరోగా రానా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్లు మరియు ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేసింది. వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్లా నాయక్' సినిమా నుండి ఒక పాటను విడుదల చేశారు. ఈ పాటలో భీమ్లా నాయక్’ను పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ దర్శనం మొగులయ్య కనిపించాడు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు దర్శనం మొగులయ్య. ఇలాంటి గొప్ప కళాకారుడికి పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తునట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దర్శనం మొగులయ్య కు పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2 లక్షలు అందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.  ఈ మేరకు ఆ మొత్తాన్ని అందించాలని కార్యాలయ సిబ్బందికి పవన్ కళ్యాణ్ సూచించారు. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన చెక్కును మొగులయ్యకు అందచేయనున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ మరొక సారి తనకు కళలు , సాహిత్యం మీద ఉన్న మక్కువను చాటుకొన్నారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ  వ్యూస్ ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: