శ్రియా లుక్స్‌కి సౌత్‌ ఇండియన్ కుర్రాళ్లు చాలామంది అవుట్ అయ్యారు. అయితే ఈ బ్యూటీ మాత్రం రష్యన్‌ టెన్నిస్ ప్లేయర్‌కి ఆండ్రీ కొశ్చీవ్‌కి పడిపోయింది. మూడేళ్ల క్రితం ఆండ్రీతో కలిసి ఏడడుగులు వేసింది. ఇక ఆండ్రీకి యూరప్‌లో ఆర్గానిక్‌ రెస్టారెంట్స్‌ బిజినెస్ ఉంది. వీళ్ల హాలిడే వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటాయి. సెలీనా జైట్లీ మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిచినప్పుడు, ఇండియన్ యూత్‌కి డ్రీమ్‌గర్ల్‌గా మారింది. ఇక బాలీవుడ్‌లో అడుగుపెట్టాక సెలీనా ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే ఈమె మాత్రం ఆస్ట్రియాకి చెందిన రెస్టారెంట్ ఓనర్ పీటర్‌తో ప్రేమలో పడింది. దుబాయ్‌లో 2010లో ఒక మీటింగ్‌లో కలిసిన వీళ్లిద్దరు 2011లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకి నలుగురు పిల్లలు ఉన్నారు.

బయోగ్రఫీ 'సచ్‌ కహూ తో' అంటూ బాలీవుడ్‌లో చిన్నపాటి సంచలనం సృష్టించింది నీనా గుప్తా. కాస్టింగ్‌ కౌచ్‌ గురించి రాసి సౌత్‌ ఇండస్ట్రీలోనూ చర్చలేపిన నీనా గుప్తా వెస్ట్‌ ఇండీస్ క్రికెటర్‌ వివిన్ రిచర్డ్స్‌తో కొన్నాళ్లు రిలేషన్‌లో ఉంది. ఈ రిలేషన్‌లో నీనాకి ఒక కూతురు కూడా పుట్టింది. అయితే తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు. నీనా మరో పెళ్లి చేసుకుంది. ప్రేమకి భాష లేదు, బౌండరీస్ అస్సలు ఉండవు. అన్‌కండీషనల్‌ లవ్‌ ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తుందని చెప్తారు. హీరోయిన్లు చాలామంది ఇలాంటి ఫారెన్ లవ్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేశారు. అయితే వీళ్లలో కొంతమంది పెళ్లి వరకు వెళ్తే, మరికొంతమంది మధ్యలోనే ఫారెన్ లవ్‌ని విడిచిపెట్టేశారు.

శ్రుతీ హాసన్‌ పెర్ఫామెన్స్‌ గురించి జనాలు ఎంతలా మాట్లాడుకుంటారో, ఈమె రిలేషన్‌షిప్‌ గురించి అదే స్థాయిలో చర్చలు జరుగుతుంటాయి. రీసెంట్‌గా కమల్ హాసన్‌ కూతురు డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో రిలేషన్‌లో ఉందని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే శాంతను కంటే ముందు లండన్‌ యాక్టర్‌ మైఖెల్ కోర్సలేతో రిలేషన్‌లో ఉంది శ్రుతి. అయితే పెళ్లి వరకు వెళ్లిన వీళ్ల లవ్‌ అనుకోని కారణాలతో మధ్యలోనే బ్రేకప్ అయ్యింది. ఇలియానా సౌత్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్లాక మరో కోణం చూపించింది. 'బర్ఫీ'లో బరువైన పాత్ర పోషించి, ప్రశంసలు అందుకుంది. ఇక ముంబాయి వెళ్లాక ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్‌ ఆండ్రూ నీబూన్‌తో లవ్‌లో పడింది. ఈ రిలేషన్‌ని చాలాకాలం మెయింటైన్ చేసింది ఇలియానా. మరి ఆ తర్వాత ఏమైందో ఏమో వీళ్లిద్దరు విడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: