బాహుబలి సినిమాతో
ప్రభాస్ ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ దేశవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలే. పాన్
ఇండియా సినిమాలు ఒకేసారి నాలుగు చేస్తూ దేశంలోని ఏ హీరోకి సాధ్యం కాని విధంగా తన కెరియర్ ను మలచుకున్నాడు ప్రభాస్. ఆయన హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఇటీవలే
రామ్ చరణ్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
రామ్ చరణ్ కు ఇది దక్కడం ఒక్కసారిగా
ప్రభాస్ అభిమానుల ను ఎంతగానో నిరాశపరిచింది. టాలీవుడ్లో నే కాదు దేశ వ్యాప్తంగా కూడా పాన్
ఇండియా సినిమాలు చేస్తూ
ప్రభాస్ క్రేజ్ తెచ్చుకో గా ఇప్పుడిప్పు డే పాన్
ఇండియా సినిమాలు చేసుకుని ఇమేజ్ తెచ్చుకుంటున్న
రామ్ చరణ్ కు ఈ విధమైన బ్రాండ్ అంబాసిడర్ ను ఇవ్వడం ఏంటి అని వారు చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే
రామ్ చర ణ్ పాన్
ఇండియా సినిమాలు విడుదలైతే
ప్రభాస్ ను మించిన క్రేజ్ ను దక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది.