ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభించిందని.. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని మేమే అడిగామని సినీ నిర్మాత
సి.కళ్యాణ్ పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉందని... సినిమా ఇండస్ట్రీ కి ఊతం ఇచ్చారని వెల్లడించారు సి.కళ్యాణ్.
ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం గతంలో ఉండేది.. అయితే అప్పట్లో ఆప్షనుగా ఉండేదని పేర్కొన్న సి.కళ్యాణ్.. ఇప్పుడు కంపల్సరీ చేయాలని మేమే కోరామని స్పష్టం చేశారు. చిత్ర ఇండస్ట్రీ కి మేలు చేసే విషయం లో అన్ని రకాలుగా సహకరిస్తామని మంత్రి వర్యులు నానీ చెప్పారని తెలిపారు. థియేటర్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారన్నారు సి.కళ్యాణ్.

అనంతరం సినీ నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడారు.  ఆన్ లైన్ టికెట్లు గతం నుంచే ఉన్నాయని... బుక్ మై షో తరహా లోనే  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి టికెట్లు కొంటారని తెలిపారు ఆదిశేషగిరి రావు.  రాష్ట్రం విడిపోయిన అనంతరం ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన సమావేశం సానుకూలంగా జరిగిందన్నారు  ఆదిశేషగిరి రావు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో సినిమాల షూటింగ్ పెరిగిందని మునుముందు ఇంకా పెరుగుతాయని తెలిపారు సినీ నిర్మాత ఆదిశేషగిరి రావు.  బెనిఫిట్ షో ల గురించి కూడా సమావేశంలో చర్చ జరిగిందని సినీ నిర్మాత ఆదిశేషగిరి రావు పేర్కొన్నారు.

ఇక అటు మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులను.. సినీ నిర్మాతలను.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యామని వెల్లడించారు.  సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై చర్చించామని స్పష్టం చేశారు మంత్రి పేర్ని నాని.  ఆన్ లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు అమ్మే ప్రక్రియకు అందరూ అంగీకారం తెలిపారని.. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం అమలుపై తాము కూడా ఇన్ పుట్స్ ఇచ్చి సహకరిస్తామన్నారని పేర్కొన్నారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమా టిక్కెట్లు అమ్మే విషయానికి కూడా ఆమోదం తెలిపిందని వెల్లడించారు మంత్రి పేర్ని నాని.

 


మరింత సమాచారం తెలుసుకోండి: