నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని ఇప్పటితరం వారు ఎంతగానో ఆశ పడగా వారి ఆశలకు తగ్గట్లుగా విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తెరకెక్కించాలని కార్యం తలపెట్టాడు. ఈ నేపథ్యంలోనే మొదట్లోనే ఈ చిత్రానికి కొన్ని అడ్డంకులు వచ్చాయి. ముందుగా దర్శకుడు గా తేజ ను అనుకోగా ఈ సినిమాకి దర్శకత్వం క్రమంలో మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా ఆయన తప్పుకున్నాడు.

ఆ వెంటనే క్రిష్ ను ఈ సినిమాకు దర్శకత్వం చేయమని బాలకృష్ణ కోరగా ఆయన వెంటనే అంగీకరించాడు. ఆపై ఎటువంటి సమస్య లేకుండా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి భాగం కథానాయకుడు గా  సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను భారీ గానే మెప్పించింది. ఇక మహా నాయకుడు సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యం లో రాగా ఆ సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది.  రాజకీయ నేపథ్యం అవడం వల్ల ప్రేక్షకులను అలరించే ఏ అంశాలు ఇందులో లేకపోవడం వంటివి ఈ సినిమా పోవడానికి ముఖ్య కారణాలు.

అంతే కాకుండా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఈ సినిమాలో చూపించలేదు. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ అంశాలను కూడా పక్కన పెట్టేశారు. కేవలం ఇప్పుడు బ్రతికి ఉన్న కొంతమంది సంతోషం, మెప్పు కోసమే ఈ సినిమా చేసినట్లుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో జరిగినవి కాకుండా ఎక్కువగా కల్పితమైనవి చూపించడం వలన ప్రేక్షకులు కూడా పెద్ద గా కనెక్ట్ కాలేకపోయారు. లక్ష్మీపార్వతి ఎపిసోడ్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వైస్రాయ్ హోటల్ ఘటన లు వంటివి చూపిస్తారని ఎక్స్ పెక్ట్ చేసిన జనాలకు అవి దరిదాపుల్లో కూడా కనిపించక పోవడంతో ఈ సినిమాను చూడలేకపోయారు. ఫలితంగా బాలకృష్ణ ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: