టాలీవుడ్ చూడని ప్రయోగం లేదు. చేయని పని కూడా లేదు. టాలీవుడ్ ది తొంబై ఏళ్ల హిస్టరీ. నాటి నుంచి చూసుకుంటే ఈనాటి వరకూ ఎందరో నటీనటులు కళాకారులు టాలీవుడ్ ని ఎన్నో మెట్లు ఎక్కించారు.

అలాంటి టాలీవుడ్ లో ఒకపుడు మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువగా వచ్చేవి. ఆనాడు ఎన్టీయార్ ఏయన్నార్ కలసి దాదాపుగా పదమూడు సినిమాల్లో చేశారు. ఇది నిజంగా ప్రపంచ రికార్డు. ఇద్దరు అగ్రశ్రేణి నటులు కలసి ఒకే సినిమాలో నటించడం అంటే అది అద్భుతం. అలా ఒకటి రెండు కాదు డజనుకు పైగా అంటే వారి మధ్య ఉన్న బాండేజ్ కి అది నిదర్శనంగానే చూడాలి.

ఆ తరువాత కాలంలో క్రిష్ణ శోభన్ బాబు కూడా ఎక్కువగా మల్టీస్టారర్లు చేశారు. ఇక క్రిష్ణంరాజు సైతం చాలానే మూవీస్ చేశారు. చిరంజీవి తరం నుంచి చూసుకుంటే మాత్రం అవి లేవనే చెప్పాలి. 80 దశకంలో చిరంజీవి బాలయ్యలతో మల్టీ స్టారర్ మూవీస్ తీయాలని చాలా మంది ట్రై చేశారు. ఈ ఇద్దరికీ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఒక ప్రముఖ డైరెక్టర్ అయితే దాదాపుగా తీసేస్తారు అని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆగింది.

ఇక ఆ తరువాత వచ్చిన నాగార్జున వెంకటేష్ ల మీద కూడా ఇదే రకమైన ప్రచారం సాగింది. నాగ్, వెంకీలతో మల్టీ స్టారర్ ని ఒక ప్రముఖ నిర్మాత ప్లాన్ చేశారు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే అవి కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఆ తరువాత తరం హీరోలు కూడా వచ్చేశారు. ఇపుడు మళ్లీ మల్టీ స్టారర్ మూవీస్ గురించి చర్చ వస్తోంది. ఈ మధ్యనే ఒక వార్త ఏంటి అంటే నాగార్జున చిరంజీవి కలసి నటిస్తారు అని. అది నిజంగా జరిగితే వారి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు జనరల్ ఆడియన్స్ కి కూడా పండుగే. ఇదే తీరున మరింతమంది హీరోలు కూడా మల్టీ స్టారర్ మూవీస్ చేస్తే బాగుంటుంది. దీని వల్ల బడ్జెట్ కలసివస్తుంది. సినిమా సక్సెస్ రేటు కూడా బాగుంటుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఆ రోజులు మళ్ళీ వస్తాయా. చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: