టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమాల విషయంలో మహేష్ బాబు భార్య నమ్రత ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి ఆమె పెత్తనం మీదనే మహేష్ బాబు ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. కథలు వినే దగ్గర్నుంచి నిర్మాణ బాధ్యతలు వరకు ఎక్కువగా ఆమెను చూసుకుంటున్నారని అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఆమె పెత్తనం ఎక్కువగా నడుస్తుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే ఆమె విషయంలో చాలామంది దర్శక నిర్మాతలు సీరియస్ గా ఉన్నారని టాలీవుడ్లో ప్రచారం మొదలైంది.

ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకునే అవకాశం ఉందనే వార్తలు మీడియాలో కూడా హల్ చల్ చేశాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఆమెనే అని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు కాబట్టి సినిమాలను చేయకుండా ఉండటం మంచిది అనే అభిప్రాయంతో ఉన్నారని రెండేళ్లు ఆగిన తర్వాత సినిమాలను మళ్ళీ మహేష్ బాబు తో మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఒకరకంగా మహేష్ బాబు సినిమా బాధ్యతల విషయంలో పూర్తి ఆధిపత్యం నడుస్తోందని సమాచారం.

అయితే ఇప్పుడు నమ్రత రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనక్కు తగ్గుతుందని టాక్. గతంలో రెమ్యూనరేషన్ కి సంబంధించి మరింతగా డిమాండ్ చేస్తూ ఉండే వాళ్లని అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి బాగాలేదు కాబట్టి మహేష్ బాబు రెమ్యూనరేషన్ విషయంలో ఆమె ఆలోచన మారిందని అంటున్నారు. సినిమాకు వచ్చే లాభాలను తక్కువగా తీసుకుని కొంత రెమ్యూనరేషన్ తీసుకునే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నారని అంటున్నారు. మహేష్ బాబు సినిమాలకు లాభాలు ఎక్కువగా నేపథ్యంలో గతంలో ఆయనకు 40 కోట్లకు పైగా ఒక సినిమాకు వచ్చేవి. అయితే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి రెమ్యూనరేషన్ విషయంలో తగ్గాల్సిన అవసరం ఉందని కొంతమంది కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: