తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకధీరుడు రాజమౌళి అంటే ఎంత గుర్తింపు ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక ఈయన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీసినా, అపజయం అంటూ ఎరుగడు.ఇక ఇప్పుడు రాజమౌళి సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతున్నది. ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం..


హీరోయిజాన్ని పవర్ఫుల్ గా చూపించే అతి కొంతమంది డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకరు. భారతీయ మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. డైరెక్టర్ రాఘవేంద్ర రావు మొదటిసారి  నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం స్టూడెంట్ నెం.1. ఈ సినిమాతో  డైరెక్టర్ రాజమౌళి సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక అప్పటి నుంచి మొదలై ఇప్పుడు బాహుబలి వరకు తన విజయాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఇక ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో మొదలు పెట్టి ఇప్పటి వరకు కొన్ని సినిమాలు మాత్రమే చేశాడు. ఇక తను తీసిన మొదటి సినిమా తో ఎన్టీఆర్ కు విజయం అంటే ఏంటో చూపించాడు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కీరవాణి ప్రతి సినిమాకు సంగీతం అందించారు.రాజమౌళి తో ఎన్టీఆర్ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ కెరీర్ పూర్తిగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. రాజమౌళి మొదట పలు టీవీ సీరియల్స్ కు డైరెక్టర్ గా పనిచేశాడు.

ఇక డైరెక్టర్ రాఘవేంద్ర రావు దగ్గర కొన్ని సీరియల్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేసాడు రాజమౌళి. ఇక ఆయన దగ్గరే కొన్ని మెళకువలు నేర్చుకున్నట్లు సమాచారం. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లను హీరోలను కూడా స్టార్ రేంజ్ ని చేయగలిగాడు రాజమౌళి. ఇక ఈయన తీసే ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే విధంగా తెరకెక్కిస్తున్నాడు. ఒక్కోసారి ఏ డైరెక్టర్ చేయలేని పని కూడా రాజమౌళి చేసి చూపించగలడు. ఇకపోతే రాజమౌళి తీసే ఏ సినిమాలైనా సంవత్సరాల తరబడి షూటింగ్ కొనసాగుతుంది కాబట్టి  అందుకే ఈయనను జక్కన్న అని పిలుస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: