సినీ ఇండస్ట్రీకి నాజర్ సుపరిచిత వ్యక్తి. టాలీవుడ్‌కే పరిమితం కాకుండా.. ఇండియా వ్యాప్తంగా అన్ని సినీ రంగాల్లో ఆయన నటించారు. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాజర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రముఖ స్టార్ హీరోలతోనూ నాజర్ నటించారు. సౌత్ ఇండస్ట్రీలో అద్భుతమైన నటులు ఉన్నప్పటికీ.. పాన్ ఇండియా రేంజ్ మూవీస్‌లో నటించే సత్తా అతి కొద్ది మందిలో మాత్రమే ఉంది. టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లో పాన్ ఇండియా రేంజ్ సినిమాల్లో నటించే వాళ్లు ఎక్కువగా ఉన్నారు.

స్టార్ హీరోలతో పాటు సహాయక పాత్రల్లో నటించే వాళ్లు కూడా పాన్ ఇండియా మూవీ స్థాయిని అందుకున్నవాళ్లు అతి కొద్ది మందే. వీరిలో ఒకరు నాజర్. సినిమాలో ఎలాంటి పాత్రలు ఇచ్చినా.. ఆ పాత్రకు తగ్గట్లు అలవోకగా క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అవుతారు. ఇప్పటివరకు పోలీస్‌గా, విలన్‌గా, తండ్రిగా, తాతగా, కమెడియన్‌గా ఇలా అన్ని రకాల పాత్రల్లో నాజర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. నటుడిగా మంచి గుర్తింపు ఉన్న నాజర్‌కు బహుబలి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలో నాజర్ నటనకు ఉత్తమ విలన్‌గా గుర్తింపు కూడా వచ్చింది.

సినీ ఇండస్ట్రీలో నాజర్ గురించి అందరికీ తెలిసిందే. కానీ పర్సన్ లైఫ్ గురించి ఎవరికీ తెలియదు. నాజర్ గొప్ప విద్యావంతుడు. చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉండేవారు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. చదువును ఎప్పుడూ నెగ్లెట్ చేయలేదు. డిగ్రీలో పట్టా కూడా పొందారు. చిన్నతనంలోనే నాటకాల్లో నటించిన అనుభవం కారణంగా సినీ ఇండస్ట్రీలో ఈజీగా అవకాశాలు వచ్చాయి. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాజర్ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ ఒక రచయిత కూడా.. పలు వ్యాసాలు, కథనాలు ఆయన రాసేవారు. ఆ వ్యాసాలు పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి.

అలాగే నాజర్ యాక్టింగ్‌లో మాస్టర్ డిప్లొమా చేశారు. ఇందులో గోల్డ్ మెడల్ కూడా పొందారు. యాక్టింగ్ స్కూల్‌లోనే నాజర్‌కు రజనీకాంత్, విజయ్ కాంత్ కూడా జాయిన్ అయ్యారంట. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా నాజర్ క్లాస్‌మేట్స్ అంట. స్కూల్ నుంచే వీరందరూ మంచి స్నేహితులని నాజర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: