జేమ్స్ బాండ్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన సినిమాలు చూసే వారు ఎంతో కోట్లాది మంది ఉంటారు. ఎందుకంటే జేమ్స్ బాండ్ సినిమాలు అన్నీ ఆశ్చర్యాన్ని కలిగించేవే. జేమ్స్ బాండ్ చేసే విన్యాసాలు ఒక ఎత్తయితే.. అందులో ఆయన వాడే పరికరాలు వెరీ స్పెషల్. సినిమాలో శత్రువులను అంతమొందించాలన్నా.. వారి నుంచి ఎస్కేప్ కావాలన్నా.. సీక్రెట్ విషయాలను బయట పెట్టాలన్నా.. జేమ్స్ బాండ్ దగ్గర ప్రత్యేకమైన పరికరాలుంటాయి. వాటితోనే జేమ్స్ బాండ్ మ్యానేజ్ చేస్తుంటాడు. ఇదే ప్రేక్షకులను ఆశ్చర్యంలోకి ముంచెత్తుంది. ఈనెల 30న ‘నో టైమ్‌ టు డై’ రిలీజ్ సందర్భంగా.. స్పెషల్ గాడ్జెట్స్ విషయాలు మీ కోసం.    

జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో ఉపయోగించే కార్లు రోడ్లపైనే కాదు నీటిలోనూ, మంచుపైనా ప్రయాణిస్తాయి. అంతేకాదు ఏ ప్లేస్ కు వెళ్లినా.. ఆ ప్లేస్ కు తగ్గట్టుగా నెంబర్ ప్లేట్ ను మార్చేసుకుంటాయి. శత్రువులు కనిపించినట్టు బుల్లెట్ల వాన కురిపిస్తాయి. అంతేకాదు గాల్లో ప్రయాణించే హెలికాప్టర్లను కూల్చేస్తాయి. శత్రువుల కార్ లను తునాతునకలు చేస్తాయి. ఇలాంటి ప్రత్యేకతలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు జేమ్స్ బాండ్. ఆయన సినిమాల్లో ఎక్కువగా వాడిన కారు ఆస్టన్‌ మార్టిన్‌.

ఇక ‘స్కైఫాల్‌’ మూవీలో జేమ్స్ బాండ్ ఉపయోగించిన కారు వెరీ స్పెషల్. ఈ తుపాకీ ఫింగర్ ప్రింట్స్ తో మాత్రమే పనిచేస్తుంది.  అది విలన్ కు చిక్కినా పేల్చడానికి  ప్రయత్నించి విఫలమవుతాడు. ఆ విషయం విలన్ కు తెలియక జేమ్స్ బాండ్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు.  

ఇక ఉంగరం విషయానికొస్తే... అది వేలికి పెట్టుకుంటే ఉంగరం.. అదే కెమెరాగా కూడా పనిచేస్తుంది. 1985లో వచ్చిన ‘ఏ వ్యూ టు ఏ కిల్‌’ చిత్రంలో ఇలాంటి ఉంగరాన్ని వాడి.. ఆ ప్రాంతంలో జరిగే  విషయాన్ని రహస్యంగా అధికారులకు తెలియజేస్తాడు. మూడు దశాబ్ధాల క్రితమే ఇలాంటి సాంకేతికతతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు జేమ్స్ బాండ్.


మరింత సమాచారం తెలుసుకోండి: