నిజానికి శ్రీను వైట్లతో కలిసి వినాయక్ ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారని సమాచారం. అందులో వెంకటేష్ మరియు మీనా జంటగా నటించిన 'అబ్బాయిగారు' మూవీ కూడా ఉందని సమాచారం. ఈరోజుతో ఆ మూవీ రిలీజ్ అయ్యి 28 సంవత్సరాలు పూర్తి కావస్తోందట. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'రాశి మూవీస్' బ్యానర్ పై ఎం.నరసింహరావు నిర్మించారని తెలుస్తుంది.
తమిళంలో భాగ్యరాజ్ హీరోగా రూపొందిన 'ఎంగ చిన్న రాస' అనే చిత్రానికి ఇది రీమేక్ గా వచ్చినట్లు సమాచారం.ఒకప్పటి సూపర్ హిట్ దర్శకుడు జంధ్యాల గారు ఈ చిత్రానికి మాటలు అందించడం మరో అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా.. ఈ చిత్రం సెట్స్ లో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను శ్రీనువైట్ల ఓ సందర్భంలో షేర్ చేసుకున్నారని సమాచారం. అదేంటి అంటే.. 'అబ్బాయి గారు' సెట్లో దర్శకులు ఇవివి సత్యనారాయణ గారు షూటింగ్ స్పాట్ కు రావడం బాగా ఆలస్యం అయ్యిందట. ఆయన వచ్చి షాట్ కు రెడీ అయ్యేప్పుడు వినాయక్ క్లాప్ కొట్టాల్సి ఉందని తెలుస్తుంది.
కానీ వినాయక్ గారు ఇవివి గారు ఎంతటికీ రావడం లేదని సిగరెట్ కాల్చుకోడానికి శ్రీను వైట్లకి చెప్పి పక్కకి వెళ్ళారని సమాచారం. ఈ గ్యాప్ లో ఇవివి గారు వచ్చేసారట. దాంతో శ్రీను వైట్లకి టెన్షన్ మొదలైందని తెలుస్తుంది. ఎంతసేపటికీ వినాయక్ రాకపోవడంతో శ్రీనువైట్ల మరింత టెన్షన్ కు గురయ్యి వినాయక్ గారిని తిట్టుకున్నారని చెప్పారట. మరోపక్క ఇవివి షాట్ కు రెడీ అవుతుంటే.. అప్పుడు తాపీగా నడుచుకుంటూ వస్తున్న వినాయక్.. ఆయన్ని చూసి పెరిగెట్టుకుంటూ అక్కడికి చేరుకున్నారని సమాచారం. వినాయక్ వల్ల ఆ రోజు పడ్డ టెన్షన్ ఎప్పటికీ మర్చిపోలేనిది అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి