నాగార్జున కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అంటే శివ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా నాగార్జున కెరియర్ ని అమాంతం మార్చేసింది. ఇక ఈ సినిమాలో కామెడీ ఉండదు, ఒక ఐటెం సాంగ్ కూడా ఉండదు, కేవలం ఫైట్లు, డైలాగులు విలన్ కు ఇచ్చేటువంటి వార్నింగ్లు ఈ సినిమాకి హైలెట్ గా ఉన్నాయి. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పుకోవచ్చు.కానీ ఇటువంటి సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ నే సాధించింది ఈ సినిమా గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఈ సినిమాలో మనం ఊహించిన సన్నివేశాలు లేకపోయినా కానీ సంచలనం సృష్టించింది.ఈ సినిమాకి డైరెక్టర్ గా రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. అత్తగారింటికి ఒక కొత్త కుర్రాడు గా వచ్చే మంచి హిట్టు కొట్టడం అంత ఆశ మశా విషయం ఏమీ కాదు. అప్పట్లో చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోల పోటీని తట్టుకుని నిలబడి ఆ రోజుల్లోనే ఎంతో స్టార్ ఇమేజెస్ సృష్టించుకున్నాడు నాగార్జున.


అప్పట్లో నాగార్జునతో రాంగోపాల్ వర్మసినిమా తీయకుంటే.. ఈ రోజున ఎంతో మంది దర్శకులు సినీ ఇండస్ట్రీలో పుట్టేవారు కారేమో.ఇప్పటి సినిమాలు అంత లా ఆకట్టుకునేలా కనిపించలేదు. ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికి 32 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. వాస్తవానికి ఈ స్టోరీ ఎంతో మంది స్టార్ హీరోల వద్దకు వెళ్లి వచ్చిందట. ఇలా ఎందరో హీరోలు ఈ కథను రిజెక్ట్ చేస్తే.. అది నాగార్జున దగ్గరకు వచ్చింది.

ఇక నాగార్జున ఒక వైలెట్ కథతో అప్పట్లో ఒక సాహసం చేశాడని చెప్పుకోవచ్చు.ఇక ఈ సినిమా నిర్మాత బాధ్యతలని తనే స్వయంగా చూసుకున్నాడు. ఇక ఈ సినిమా 22 కేంద్రాలలో 100 రోజులుగా ఆడి, 5 సెంటర్లలో 175 రోజులు ఆడి ఒక చరిత్ర సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: