నలుగురు ఒకే మాట మీద ఉండటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎప్పుడూ ఒకే మాట మీద ఏ నలుగురు ఉండరు కానీ మా అసోసియేషన్ లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు అందరూ ఒకే తాటిపై ఒకే మాటపై ఉంటూ  ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.  ప్రకాష్ రాజ్ ఓటమిని అంగీకరించక వారందరూ కూడా ప్రకాష్ రాజ్ తో కలిసి తమ పదవులకు రాజీనామా చేశారు. అంతే కాదు ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగానే వీరు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నాం అని చెప్పారు.

ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ ఘటన పై ఎన్ని ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో చాలా అన్యాయం జరిగిందని కూడా  వెల్లడించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకువచ్చి ఓట్లు వేయించారని రాత్రికిరాత్రే ఫలితాలను పూర్తిగా మార్చివేశారు అని చెప్పారు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు.మా సభ్యులంతా బయటకు వచ్చినా మాకు ఓటేసిన సభ్యుల తరఫున నిలబడతామని స్పష్టం చేశారు ప్రకాష్ రాజ్.

ఏదేమైనా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఒకే తాటిమీద ఉండడం మా సభ్యులలో కొంత ఆనందానికి గురి చేసే విషయం. అలాగే చేసిన తప్పు తెలుసుకునే విధంగా చేసిన విషయం అని తెలుస్తోంది. ఎందుకంటే ఒక తాటిపై నిలబడినా వారు గెలిస్తే పనులు బాగా జరుగుతాయి. అభివృద్ధి బాగా జరుగుతుంది అని అందరూ నమ్ముతారు. ఆ విధంగా ఇప్పుడు ఏం చేసేది ఏమీ లేదు కాబట్టి ప్రకాష్ రాజ్ ను ఓదార్చడం మాత్రమే వారి చేతిలో ఉంది. నిజానికి ప్రకాష్ రాజ్ ను ఓడించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇక విష్ణు  అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బై లాస్ మార్చి తెలుగు వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలనే నిబంధన తీసుకురాకపోతే మా సభ్యత్వ రాజీనామా వెనక్కి తీసుకుంటా అన్నారు.  ఓటు వేయడానికో ఎవరో ఒకరిని గెలిపించడానికి అయితే మా సభ్యుడిగా ఉండడం నాకు ఇష్టం లేదని తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: