నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించారు, కొన్ని రోజుల క్రితమే అఖండ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసినట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో ఏర్పడిన కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది, ఈ సినిమాలో దీపావళికి విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు కూడా అనేక వార్తలు బయటకు వచ్చాయి, కాకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అఖండ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు అఖండ సినిమా నైజాం రైట్స్ ను దాదాపు 20 కోట్ల వరకు వెచ్చించి  తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరి దిల్ రాజు నైజాం ఏరియా కు గారు అఖండ సినిమాకు ఇంత మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన సినిమాల రిజల్ట్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించాయి, అలాగే మరొక సారి కూడా అలాంటి సీన్ రిపీట్ అవుతుంది అని దిల్ రాజు ఈ సినిమాను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్లు కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: