పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ తన కెరీర్ ను మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ బిజీగా మార్చుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ఆయన సాహో రాధే శ్యామ్ అంటూ సంవత్సరాల కొద్దీ రెండు సినిమాలను మాత్రమే చేశాడు. దాంతో ఆయన అభిమానులు ప్రభాస్ ను సినిమాలు ఎక్కువ చేసే విధంగా ఒత్తిడి చేశారు.  దాంతో అభిమానుల కోరిక మేరకు ప్రభాస్ ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

ప్రస్తుతం ఆయన హీరోగా చేసిన రాధే శ్యామ్ చిత్రం జనవరిలో సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం రాబోతుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఆయన బాలీవుడ్లో తెరంగేట్రం చేయబోతున్న సినిమా ఆది పురుష్. రామాయణం ఆధారంగా 3డి టెక్నాలజీ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తుండగా సీతగా కృతిసనన్ నటించబోతుంది. ఇక నాగ్ అశ్విన్ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది.

ఇకపోతే రెబల్ స్టార్ నటిస్తున్న మరొక సినిమా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని స్పిరిట్. ఈ చిత్రం ప్రభాస్ 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కరీనా కపూర్ విలన్ గా నటిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినబడుతున్నాయి. ఈమె పాత్ర సూపర్ ఉమెన్ పాత్ర ను పోలి ఉంటుంది అని చెబుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ చిత్రాలలో సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ విలన్ గా నటిస్తున్నారు. నిజ జీవితంలో వీరు భార్యాభర్తలు కాగా ఈ భార్య భర్తలు ప్రభాస్ కు విలన్ గా నటించడం ఆయా సినిమాలకు ఎంతటి గొప్ప క్రేజ్ ను తీసుకు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: