టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ కాస్త ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు అనే విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం కొన్ని సినిమాల మీద ఎక్కువగా దృష్టి సారించే ఆ సినిమాల కోసం ఎక్కువగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా ఒక నెగిటివ్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ముందుకు వెడుతున్నాడు అని ఈ నేపథ్యంలోనే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఇప్పటి నుంచే రచించుకున్నట్టు ఉన్నాడని అంటున్నారు.

అదే విధంగా తన కొడుకుతో ఒక షార్ట్ ఫిలిం ప్లాన్ చేసేందుకు రెడీ అవుతున్నాడని తన భార్య స్నేహారెడ్డి సూచనల మేరకు ఒక దర్శకుడి తో మాట్లాడాడు అని ఆ దర్శకుడు కూడా షార్ట్ ఫిలిం చేయడానికి రెడీ అయ్యాడని సమాచారం. ఈ షార్ట్ ఫిలిం సమాజానికి ఒక సలహా ఇచ్చే విధంగా ఉంటుందని కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కథకు సంబంధించి స్నేహ రెడ్డి సూచనల మేరకు ఈ సినిమా చేస్తున్నాడని కూడా తెలుస్తోంది.

ఒకసారి కథ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఉద్యోగం చేసే  సమయంలో పడుతున్న ఇబ్బందులు అలాగే భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసే సమయంలో ఆ ప్రభావం పిల్లల మీద ఏ విధంగా పడుతుంది అనేది ఈ సినిమాలో చూపిస్తారు అని అంటున్నారు. దీనికి సంబంధించిన కథ కూడా స్నేహ రెడ్డి ఇచ్చినట్టుగా సమాచారం. మరి ఈ కథ ఎప్పుడు ముందుకు వెళుతుంది ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఈ దర్శకుడు మాత్రం ఖచ్చితంగా వంశీ పైడిపల్లి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఈ సినిమా ముందుకు వెళుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: