అయితే జనవరి 12న ఎట్టి పరిస్థితులలోను విడుదల అయి తీరాలి అని ప్రయత్నాలు చేస్తున్న పవన్ ‘భీమ్లా నాయక్’ మూవీకి దిల్ రాజ్ సమస్యగా మారబోతున్నాడా అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్లో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల ప్రకటన వచ్చిన తరువాత ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా వేయాలని ఆలోచించారు.
అయితే ఈమూవీ వ్యవహారాలు వెనక ఉండి నడిపిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమూవేని సంక్రాంతి రేస్ లో ఉంటె బాగుంటుంది అన్న తన అభిప్రాయాన్ని ఈ మూవీ నిర్మాతలతో పాటు పవన్ కు చెప్పడంతో పవన్ కూడ సంక్రాంతి రేసుకు ఓటు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామం దిల్ రాజ్ కు ఏమాత్రం నచ్చడం లేదు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనికికారణం సంక్రాంతి రేస్ కు విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ సినిమాల నైజాం రైట్స్ దిల్ రాజ్ తీసుకోవడం అని అంటున్నారు. అంతేకాదు ‘భీమ్లా నాయక్’ నైజాం రైట్స్ కూడ దిల్ రాజ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈమూడు సినిమాల పై దిల్ రాజ్ పెట్టుబడి 150 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. దీనితో రాబోతున్న సంక్రాంతికి ఈమూడు భారీ సినిమాలు ఒకేసారి పోటీ పడితే ఈ అనవసరపు పోటీ వల్ల ఏసినిమాకు పూర్తి న్యాయం జరగదని దిల్ రాజ్ భావిస్తూ ‘భీమ్లా నాయక్’ ను సంక్రాంతి రేస్ నుండి తప్పించమని పవన్ తో రాయబారాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి