దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న, యంగ్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఇండియా మూవీ RRR. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా మా వచ్చే ఏడాది జనవరి 7 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా శరవేగంగా చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో తమ 30వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఎన్టీఆర్ నటించబోయే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు కొరటాల.

 అయితే ప్రస్తుతానికి కొరటాల శివ ఈ సినిమాలో మిగిలిన నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మాత్రం ఫ్యామిలీతో వ్ కేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ వెకేషన్ అయిపోయి వచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.  సినిమా ఇంకా పూర్తి కాకముందే ఏప్రిల్ 29 2022 న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించేశారు. అయితే ఎన్టీఆర్సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడో కూడా చెప్పేసాడు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ మీడియాతో కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది.

 అయితే ఇటీవల తారక్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో నా నెక్స్ట్ సినిమా వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా సెట్స్పైకి రాబోతోంది ఈ సినిమా కూడా మీరు ఊహించిన దాని కంటే బావుంటుందని తెలియజేశాడు. తారక్ కామెంట్లు విన్న నందమూరి అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు వారి వారి సంతోషాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంతిని ప్రభాస్తో కలిసి సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే ఈ సినిమా పూర్తయిన వెంటనే తారక్  తో చేయబోయే సినిమా షూటింగ్ పనులను ప్రారంభించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: