బిగ్బాస్ కార్యక్రమము ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 80 రోజులు పూర్తి చేసుకుంది బిగ్బాస్ కార్యక్రమం. ఈ క్రమంలోనే 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన బిగ్ బాస్ హౌస్ లో కాస్త ప్రస్తుతం కేవలం ఎనిమిది మంది కంటెస్టెంట్ లు  మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లలో టాప్ ఫైవ్ లో ఎవరు నిలబడుతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా బిగ్ బాస్ హౌస్ లో చివరగా బిగ్బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి షణ్ముక్ బిగ్ బాస్ చివరి కెప్టెన్ గా అవతరించాడు.


 అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ పావురాలు ఎవరు కనిపించడం లేదు. కానీ యూట్యూబర్లు షణ్ముఖ్, సిరి మధ్య స్నేహం మాత్రం అందరినీ కాస్త చిరాకు తెప్పిస్తుంది అనే చెప్పాలి. ఒకవైపు మంచి స్నేహితులం అని చెబుతూనే బిగ్ బాస్ హౌస్ లో ఏకంగా హగ్గులు కిస్సులతో మర్చిపోతున్నారు. దీంతో ఇక వీరిద్దరి కి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం షణ్ముఖ్ కి దీప్తి సునైనా గర్ల్ఫ్రెండ్ ఉంది అనే విషయం తెలిసిందే.. సినీ కూడా ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. అతని తో పెళ్లికి కూడా సిద్ధమైంది. ఇలాంటిది ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో హగ్గులతో రెచ్చిపోవడం మాత్రం  బుల్లితెర ప్రేక్షకులందరికీ చిరాకు తెప్పిస్తోంది.


 అయితే తనకు షణ్ముక్ తో అలా చేయడం తప్పు అని తెలిసినప్పటికీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాను అంటూ ఇటీవల బిగ్ బాస్ కి తెలిపింది సిరి. ఇంట్లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ షణ్ముక్ సిరి ఎప్పుడు సపరేట్ గా కనిపిస్తూ ఉంటారు.  షణ్ముక్ సిరి ల మధ్య హగ్గులు కిస్సులు కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు కుటుంబ సభ్యులకు కూడా నచ్చడం లేదు అని అర్థమవుతుంది. ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ పేరెంట్స్  వస్తున్నారు. ఈ క్రమంలోనే సిరి తల్లి కూడా వచ్చింది. దీంతో సిరి ఎంతో ప్రేమగా వెళ్లి తల్లినీ కౌగిలించుకుంది. నేను ఎలా ఆడుతున్నాను అంటూ అడిగింది. అయితే నువ్వు బాగా ఆడుతున్నావు కానీ.. షణ్ముఖ్ ను హగ్ చేసుకోవడం నాకు నచ్చట్లేదు. బాగా హెల్ప్ చేస్తున్నాడు కానీ.. అతనికి హగ్ ఇవ్వడం నచ్చట్లేదు అంటూ అందరి ముందే సిరి తల్లి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు షణ్ముక్.

మరింత సమాచారం తెలుసుకోండి: