అల్లు అర్జున్‌ సుకుమార్‌ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని తెలుస్తుంది.. ఈ సినిమా కు సంబంధించిన ఐటెం సాంగ్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారని సమాచారం.

సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిందని తెలుస్తుంది.దాంతో సినిమా విడుదల కోసం అంతా ఎదురు చూస్తున్నారని సమాచారం. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ బజ్‌ ఒకటి వచ్చిందట. అదేంటి అంటే ఈ సినిమా రన్‌ టైమ్‌ రెండు గంటల నలబై నిమిషాలు ఉండబోతుందని సమాచారం. ఇంకా పాట చిత్రీకరణ కాలేదు ఇంకా ఫైనల్‌ ఎడిట్ అవ్వలేదు అప్పుడె ఎలా అంటూ కొందరికి అనుమానాలు రావచ్చని తెలుస్తుంది. కానీ పాట మాత్రమే బ్యాలన్స్ ఉందట మిగిలిన షూటింగ్‌ అంతా పూర్తి అయ్యిందని సమాచారం.పాట కాకుండా ఇప్పటికే ఎడిటింగ్‌ కూడా పూర్తి చేశారని సమాచారం.నాలుగున్నర నిమిషాల నిడివితో పాట ఉంటుందని ఆ పాటను జత చేస్తే రెండు గంటల నలబై నిమిషాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది..

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్న నేపథ్యంలో మరియు సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో సినిమా కు అన్ని వైపుల నుండి పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది .. ఒక వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని కనుక రన్‌ టైమ్‌ విషయంలో లీక్ వచ్చిందని సమాచారం..మొత్తానికి రెండు గంటల నలబై నిమిషాల రన్ టైమ్‌ అంటే ఖచ్చితంగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఓ రేంజ్‌ లో ఎంటర్‌ టైన్ అవుతారని అంటున్నారని తెలుస్తుంది..

  రంగస్థలం దాదాపుగా మూడు గంటలు ఉందని  కాని ఈసారి 20 నిమిషాలు తక్కువగా ప్లాన్‌ చేస్తున్నాడట సుకుమార్‌. రంగస్థలం సినిమా విడుదల తర్వాత ఒకటి రెండు సన్నివేశాల్లో కట్‌ చేయాల్సి వచ్చిందట.పుష్పకు ఆ పని చేయకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: