ప్రియమణి.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈమెకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి తన హవా నడిపించింది ప్రియమణి. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత చాలా రోజుల వరకు సినిమాలకు దూరం అయింది అని చెప్పాలి. కానీ ఆ తర్వాత ఢీ అనే కార్యక్రమంలో జడ్జిగా అవతారమెత్తింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ కార్యక్రమంలో ఈ అమ్మడు అందం అభినయం ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ తర్వాత ఇక ఎన్నో సినిమా అవకాశాలు కూడా వచ్చి ఈ అమ్మడు ముందు వాలడం మొదలయ్యాయి. వరుస అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప అనే సినిమాతో సూపర్ సక్సెస్ను అందుకుంది ప్రియమణి. ఇక ఇటీవల కాలంలో వయసు పెరుగుతున్నప్పటికీ మరింత అందంగా జీరో సైజ్ కి మారిపోయింది. ఇకపోతే ఇటీవల హీరోయిన్ ప్రియమణిపై హీరో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా నువ్వు రోజురోజుకీ హాట్ గా తయారవుతున్నావ్ అంటూ అందరిముందే కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా జడ్జిగా ఉన్న ప్రియమణి మీతో నటించే అవకాశం రాలేదు అంటూ అల్లుఅర్జున్తో చెబుతోంది. ఇంకా చాలా టైం ఉంది కదా ఫ్యూచర్లో చూద్దాంలే ఇక ఇప్పుడు నువ్వు ఇంకా సన్నబడి హాట్ గా తయారయ్యావ్ అంటూ అల్లు అర్జున్ అంటాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: