ఇక నందమూరి నటసింహం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రెండు రోజుల క్రితం విడుదలైన 'అఖండ' సినిమా టాలీవుడ్ కు కొత్త హోప్ ను ఇచ్చిందనే చెప్పాలి. మొన్నటి దాకా కూడా పెద్ద సినిమాల భవిష్యత్తు ఏమైపోతుందో అంటూ భయపడిన పెద్ద సినిమాల మేకర్స్ హ్యాపీగా టికెట్ రేట్లతో సంబంధం లేకుండా ఇప్పుడు తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.ఇక అఖండ సినిమా ఇంత పెద్ద ఘన విజయం సాధించడనికి ముఖ్య కారణం ఖచ్చితంగా అదిరిపోయే నేపథ్య సంగీతం ఇంకా దద్దరిల్లే ఫైట్స్ వల్లే అని అనుకోవాలి.సినిమా చూసిన జనాలు ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా ఫైట్స్ కే పెద్ద పీట వేయడం జరిగిందని చెప్పాలి. దాంతో బనందమూరి బాలకృష్ణ ఇంకా బోయపాటి శ్రీను కంటే కూడా తమన్ నేపథ్య సంగీతానికి గాను ఇంకా అలాగే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లను తెర వెనుక హీరోలుగా పరిగణిస్తున్నారు.

ప్రతి సీన్ కు కూడా ఓ ఎలివేషన్… ఇంకా ఆ తర్వాత ఫైట్ ఉంటుంది. అఘోరగా బాల కృష్ణ ఎంట్రీ సీన్ దగ్గర నుండీ సినిమా క్లైమాక్స్ సీన్ వరకు ఎన్నో బోలెడన్ని ఎలివేషన్ లు ఇంకా ఫైట్ లు ఉంటాయి.ఇక వాటిని చూస్తున్నంత సేపు కూడా నందమూరి అభిమానులకు ఇంకా అలాగే ప్రేక్షకులకు కూడా గూజ్ బంప్స్ రావడం అనేది ఖాయం అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. సోషల్ మీడియాలో అయితే బాలకృష్ణ కంటే కూడా తమన్ నే ఆడియన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఈ సినిమా విషయంలో అటు మ్యూజిక్ డైరెక్టర్ యస్ యస్ తమన్ కు కానీ ఇటు ఫైట్ మాస్టర్స్ అయినా రామ్ లక్ష్మణ్ లకు గాను వందకి వంద మార్కులు తప్పకుండా పడతాయి. ఇలాంటి ఊర మాస్ సినిమాలకి ఈ తెర వెనుక హీరోలు చాలా అవసరం అని అఖండ సినిమా చెప్పకనే చెప్పింది.ఇక థియేటర్ లలో కూడా ఈ సినిమా బ్రహ్మాండమైన వసూళ్ళని రాబడుతుంది.ఇక మున్ముందు రోజుల్లో ఈ సినిమా వసూళ్లు ఎంత వరకు రీచ్ అవుతాయో చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: