దేశవ్యాప్తంగా మంచి నటుడిగా గుర్తింపు ఉన్న నటుల్లో మాధవన్ ఒకరు. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆర్ మాధవన్ తన భార్య సరితతో బహిరంగంగా సన్నిహితంగా ఉండటం, అదే సమయంలో పోలీసులకు పట్టుబడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. బ్యాండ్‌ స్టాండ్, కార్టర్ రోడ్‌ లో గతంలో జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాధవన్ ఓ పాపులర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “నేను సరిత డేటింగ్ చేస్తున్నప్పుడు, మేము సన్నిహితంగా ఉండటానికి ఎవరికీ తెలియని సీక్రెట్ ప్లేస్ ఒకటి ఉండేది. కాబట్టి అప్పట్లో జరిగిన కథలు చెప్పడానికి చాలానే ఉన్నాయి. మేము ముంబై లోని ఇతర జంటల మాదిరిగానే డబుల్ డెక్కర్ బస్సుల పైన కూడా సరదాగా గడిపే వాళ్ళం. ఇక సీక్రెట్ ప్లేస్ లో ఒకేసారి ఇద్దరం మంచి రొమాంటిక్ మూడ్ లో ఉండగా, సడన్ గా అక్కడికి పోలీసులు వచ్చారు. వాళ్ళు మా ఇద్దరినీ 'ఇంటికి వెళ్లండి' అని చెప్పారు. ఇక అక్కడ నుంచి కదలక తప్పలేదు. ఈ స్థలంలో మాకు నిజంగా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి” అని అన్నారాయన.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ "ప్రజలు నన్ను ఊహించుకున్నంత ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు 50 ఏళ్లు. అనిల్ కపూర్ నా కంటే ఫిట్‌గా ఉన్నారని, అతను అద్భుతమైన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. అయితే నా భార్య కూడా నన్ను బరువు తగ్గమని అడుగుతూ ఉండేది. ఒకరోజు ఒక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు నేను బరువు తగ్గినట్టు నా భార్యకు చెబితే ఆమె అస్సలు నమ్మలేదు. అప్పుడు ఫోటో దిగి పంపాను. అప్పుడు నేను చెన్నై లో సినిమా చిత్రీకరణలో ఉన్నాను" అని తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పారు. కాగా మాధవన్, సరితా బిర్జే 8 సంవత్సరాల పాటు డేటింగ్ చేసి, ఆ తర్వాత 1999 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.

మాధవన్ సినిమాల విషయానికొస్తే తన తదుపరి రొమాంటిక్ కామెడీ మూవీ "డికప్ల్డ్"తో విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఇందులో సుర్వీన్ చావ్లా కూడా ఉన్నారు. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించిన ఈ షో డిసెంబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: