
రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా ప్రస్తుతం రాజమౌళి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రస్తుతం ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.
సాధారణంగా సినిమా ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం రాజమౌళికి అలవాటు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల గురించి పలు విషయాలను చెప్పుకొచ్చారు . జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వల్ల సినిమా 25 రోజులు లేట్ అయిందని రామ్ చరణ్ పగిల్లాడు అంటూ ఎన్టీఆర్ వచ్చి నాకు కంప్లీట్ చేస్తాడు.. ఏంటి అని అడిగితే అయ్యో నాకేం తెలియదు అంటే అమాయకుడిగా రామ్ చరణ్ యాక్టింగ్ చేస్తాడు అంటూ రాజమౌళి చెబుతూ ఉంటాడు. ఇంతలో పక్కనే ఉన్న ఎన్టీఆర్ ఏకంగా రాజమౌళి నడుము గిల్లు తాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన జక్కన్న ఇక నిలబడి తన స్పీచ్ కంప్లీట్ చేశాడు.