‘రాథే శ్యామ్’ మూవీ పూర్తి కావడానికి 3సంవత్సరాలు పట్టింది అన్నవిషయం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు జిల్ రాథా కృష్ణ ఓపెన్ గా చెప్పిన విషయం విని చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. ఈమూవీ కథ గురించి తాను 18 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాని తన గురువు చంద్రశేఖర్ ఓలేటి తాను ఈకథ గురించి ఎన్నో నెలలు మేధోమధనం చేస్తూ ఆలోచించిన విషయాన్ని బయటపెట్టాడు.



ముఖ్యంగా ఈమూవీ క్లైమాక్స్ గురించి తామిద్దరం చాల ఆలోచనలు చేయవలసి వచ్చిందని ఈమూవీ కథలో హీరో హస్త సాముద్రికం చెపుతాడు కాబట్టి జాతక రీత్యా ఈకథ ఎవరికీ యోగం ఉంటే వారి దగ్గరకి వెళుతుంది అంటూ చంద్రశేఖర్ ఏలేటి తనతో అన్నమాటలు నిజం అయి ఇప్పటికి ఈమూవీ ప్రభాస్ తో ఫిక్స్ అయింది అంటూ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు.


అంతేకాదు ఈమూవీలో ఫైట్స్ ఉండవని కేవలం లవ్ రొమాన్స్ ఫన్ ద్రిల్స్ కలర్ ఫుల్ సీన్స్ చాల ఉంటాయి అని చెపుతూ ఈమూవీ గురించి ఎలాంటి అసంతృప్తి లేకుండా ప్రభాస్ అభిమానుల దగ్గర జాగ్రత్త పడ్డాడు. ఇది ఇలా ఉండగా ఈమూవీ ట్రైలర్ ను చూసిన సగటు ప్రేక్షకుడు ఈమూవీ ట్రైలర్ అద్భుతం అని అనలేక అలాగే బాగాలేదు అని చెప్పలేక ప్రతి సీన్ చెక్కినట్లు ఉంది అని కామెంట్స్ చేస్తున్నాడు. ఈ ట్రైలర్ లో అడుగడుగునా రోమ్ కల్చర్ కనిపించినట్లు ఉంది అంటూ కామెంట్స్ కూడ వస్తున్నాయి.


అయితే ఈమూవీలో ఏదో ఒక కొత్తదనం కనిపిస్తోంది కానీ ఎంతవరకు ఆ కొత్త దానాన్ని సగటు ప్రేక్షకుడు ఆహ్వానిస్తాడు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ సంక్రాంతి సమయానికి ఒమైక్రాన్ కేసుల పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వం విధించే ఆంక్షలతో ధియేటర్ల పరిస్థితిని బట్టి ‘రాథే శ్యామ్’ కలక్షన్స్ ఆధారపడి ఉంటాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: