దర్శక దీరుడు రాజమౌలి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్ర లో నటిస్తూన్నారు.. ఇప్పటికే ఈ సినిమా గురించి బయటకు వచ్చిన అన్నీ సన్నీవేశాలు సినిమా పై భారీ అంచనాలను పెంచుతుంది. రిలీజ్ కు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటం తో హంగామా మాత్రం మాములుగా వుండదు. అలా ఇద్దరి ఫ్యాన్స్ నమ్ముతున్నారు. చిత్ర యూనిట్ ఇప్పటికే కొన్ని సన్నీవేశాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది.


ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం.. ఇంటర్వెల్ కు 15 నిమిషాల ముందు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల ఫైట్ మొదలు అవుతుందట. దాదాపుగా ఇద్దరి మద్య సాగే పది హేను నిమిషాల సన్నివేశాలు, ఫైట్స్ అందరినీ కంటతడి పెట్టిస్తాయని చిత్రబృందం అంటున్నారు. ఇద్దరు హీరోల మద్య ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సమయంలో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారని అన్నాడు. ఆ ఫైట్ ఇంటర్వెల్ కు ముందు వస్తుందట. ఇద్దరి మద్య సన్నివేశాలు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తాయని అంటున్నారు.


ఇటువంటి సన్నీవేశాలు ఉన్న సినిమాను కళ్ళతో చూస్తె తప్ప ఆ ఫీల్ రాదని అంటున్నారు. వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి సినిమా ను తెరపైకి తీసుకు వస్తున్నారు.కాగా, డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందు లో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను జనవరి 7 విడుదల చేస్తున్నారు.. అలాగే ఈ సినిమా ను  వేరే దేశాల లో కూడా విడుదల చేస్తున్నారు. మరి అప్పుడు సినిమా ఎలా వుంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: