ఈ క్రమంలోనే నటసింహ నందమూరి బాలకృష్ణకు జోడీగానూ `శ్రీమన్నారాయణ` చిత్రంలో ఇషా చావ్లా నటించింది. అలాగే సునీల్‌తో పూలరంగడు, మిస్టర్ పెళ్ళి కొడుకు, అల్లరి నరేష్‌తో జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక ఇలా పలు చిత్రాలు చేసింది గానీ.. ఇషా చావ్లాకు సరైన హిట్ మాత్రం పడలేదు. నిజానికి కెరీర్ స్టార్టింగ్‌లో ఇషా చావ్లా టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు.
అయితే అందరి ఊహలకు భిన్నంగా ఈ బ్యూటీ టాలీవుడ్లో ఫేడవుట్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. ఈమె కెరీర్ నాశనం అవ్వడానికి ప్రధాన కారణం.. సినిమా కథల ఎంపికలో చేసిన పొరపాట్లేనట. కథల ఎంపిక విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే వరుస ఫ్లాపులు పడ్డాయని.. దాంతో ఇషా చావ్లాను దర్శక నిర్మాతలు పట్టించుకోవడం మానేశారని టాక్ ఉంది. ఇక తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించక పోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇషా చావ్లా.. తరచూ అదిరిపోయే ఫొటో షూట్లు, క్యూట్ వీడియోలతో తన ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తుంటుంది. అయితే తాజాగా ఈ భామ కరోనా వైరస్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ తెలియ జేసింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందన్న ఇషా చావ్లా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొంది. అలాగే అందరూ దయచేసి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు పలువురు సినీ ప్రముఖులు ఇషా చావ్లా త్వరగా కరోనా మహమ్మారిని జయించి రావాలంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి