సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా.. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ తెరంగేట్రం సినిమా హీరో సంక్రాంతి సందర్భంగా జనవరి 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో అశోక్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించాయి. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వస్తున్న ఐదవ హీరోగా గల్లా అశోక్ క్రేజ్ తెచ్చుకున్నాడు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో క్రేజీ మూవీగా హీరో సినిమా తెరకెక్కింది. ఆల్రెడీ సుధీర్ బాబుకి భలే మంచి ర్రోజు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ గా శ్రీరాం ఆదిత్య పాపులర్ అయ్యాడు.

ఇక ఇప్పుడు అదే దర్శకుడితో గల్లా అశోక్ సినిమా వస్తుంది. ఈ సినిమాలో అశోక్ తన నటనతో అందరిని సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. అంతేకాదు సినిమాలో ఓ స్టార్ డైరక్టర్ స్పెషల్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో స్టార్ డైరక్టర్ అనీల్ రావిపుడి కెమియో రోల్ చేశారట. సక్సెస్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన అనీల్ రావిపుడి గల్లా అశోక్ హీరో సినిమాలో ఓ చిన్న పాత్ర చేశారట. ఆయన రియల్ లైఫ్ క్యారక్టర్ అంటే డైరక్టర్ పాత్రనే సినిమాలో చేసినట్టు తెలుస్తుంది.

మహేష్ తో లాస్ట్ ఇయర్ సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ ఇచ్చాడు డైరక్టర్ అనీల్ రావిపుడి. ఇప్పుడు గల్లా అశోక్ హీరో సినిమాకు కూడా తన సపోర్ట్ అందించారు అనీల్ రావిపుడి. సరైన కథ దొరికితే గల్లా అశోక్ తో అనీల్ రావిపుడి సినిమా తీసినా తీస్తాడని అంటున్నారు. గల్లా అశోక్ హీరో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించేలా వస్తుంది. మరి సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. పోటీగా అక్కినేని బంగార్రాజు, ఆశిష్ రౌడీ బోయ్స్ వస్తుంది. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది.
   


మరింత సమాచారం తెలుసుకోండి: