చిత్ర పరిశ్రమలో సమంత గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను సంపాదించుకుంది. ఇక ఆమె తొలిసారిగా ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. తన అందంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలలో ఇష్టమైన హీరోయిన్ గా చెరగని ముద్ర వేసుకుంది.

ఇండస్ట్రీలో సీనియర్ నటుడు అక్కినేని ఇంటి వారసుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మరింత గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత తన స్టార్ డాం ను మరింత పెంచుకుంది. తాజాగా ఈ జంట విడిపోయి  టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారారు. అయితే విడాకుల తర్వాత సమంతలో చాలా మార్పులు వచ్చాయి. ఇక సినిమాల విషయంలో కూడా బాగా దూసుకెళ్తుంది ఈ భామ.

ఇక ఇటీవలే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో డీగ్లామర్ లుక్ తో సెన్సేషనల్ విజయం అందుకుంది. సమంత నటపైనే కాకుండా  బిజినెస్ ఉమెన్ గా కూడా పలు బాధ్యతలు తీసుకున్నారు. పాళీ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రాణిస్తున్నారు. మరోవైపు జిమ్ములో తన వర్కౌట్లు చేస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అంతేకాదు.. సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

సాధారణంగా సమంత సమంత తాను ఏదైనా కొత్తగా వర్క్ ఔట్ చేస్తే వెంటనే దానిని పోస్ట్ చేస్తుంది. అయితే తాజాగా తాను ఒక వర్కౌట్ చేయగా దానికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా లో షేర్ చేస్తుంది. ఆమె పెట్టె వీడియోలను చూసి పలువురు ఇన్స్పైర్ అయ్యి అచ్చం సమంత లాగా చేయాలని ప్రయత్నం చేశారు. ఆ వీడియోని కూడా ఆమె ఇన్ స్టా లో షేర్ చేసింది. ఆ వీడియోలో చేస్తున్న ఆమెకి చేతులు లేకపోవడం గమన్హారం. సమంత ఆ వీడియోను పోస్ట్ చేస్తూ తన ఇన్స్పిరేషన్ ఆమెనే అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: