సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా పూర్తయిన రోజు నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఆ డైరెక్ట‌ర్ ఇదే క‌థ‌పై ఆలోచిస్తూ ఉన్నారు.ఓ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొడ‌తానన్న న‌మ్మ‌కంతో ఉన్నారు.ఆత్మ‌విశ్వాసం నిరూపించుకునే ప‌నిలో ఉన్నారు అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ! ఎందుకంటే ఆయ‌న‌కు గ‌త కొద్ది కాలంగా హిట్లు లేవు.ముందు సినిమా మంచి పేరు తీసుకురాలేదు.నేల టికెట్ క‌నీసం నేల కూడా నిండ‌లేదు.దీంతో ఈ సారి త‌న‌కు బాగా క‌లిసివ‌చ్చిన పాయింట్ కు కాస్త ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచారు. సోగ్గాడే క‌థ‌కు స‌మాంత‌రంగా మ‌రో ప్రేమ క‌థ‌ను క‌లిపారు..దీంతో నాగ చైత‌న్య, కృతి జోడి కొత్త‌గా తెరపైకి వ‌చ్చి సంద‌డి చేసింది.

ఒక‌విధంగా ఈ క్యారెక్ట‌ర్ నాగ్ కోస‌మే పుట్టింది
బంగార్రాజు క్యారెక్ట‌ర్ కు సంబంధించి
ఎన్ని వేరియేష‌న్స్ ఉన్నాయో!
వాటినన్నింటినీ స‌రిగా అర్థం చేసుకుని
పాత్ర స్వ‌రూప స్వ‌భావాలు రీత్యా న‌టించి
మంచి పేరు తెచ్చుకున్నారు నాగార్జున


క‌థకూ,క‌థ‌నానికీ మంచి అనుబంధం ఉంది.ఈ  సినిమా ఆ అనుబంధాన్ని మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. క‌థ క‌ల్యాణ కృష్ణ రాశారు. క‌థ‌నం స‌త్యానంద్ అందించారు.ముందు నుంచి అనుకున్న విధంగానే ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంటుంది.వాస్త‌వానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సిందే కానీ కొవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డుతూ ప‌డుతూ వ‌చ్చింది.అయినా కూడా ఈ క్రేజీ ప్రాజెక్టు పై ఎటువంటి అంచ‌నాలూ త‌గ్గ‌లేదు.సినిమాకు సంబంధించి ఆశించిన ఫ‌లితం మాత్ర‌మే కాదు ఊహించ‌ని ఫ‌లితం కూడా!


వాస్త‌వానికి సోగ్గాడే చిన్ని నాయ‌న హిట్ త‌రువాత చాలా కాలం గ్యాప్ వ‌చ్చింది.ఈ గ్యాప్ లో నాగ చైత‌న్య కోసం ఓ సినిమా చేశాడు క‌ల్యాణ్ కృష్ణ.రారండోయ్ వేడుక చూద్దాం అని సంద‌డి చేశాడు. కానీ ఆ సినిమా మ‌రీ అంత స్థాయిలో పేరు తెచ్చుకోలేక‌పోయింది. త‌రువాత ర‌వితేజ‌తో నేల‌టికెట్ సినిమా తీశాడు.అది కూడా వ‌ర్కౌట్ కాలేదు.ఈ సారి త‌న‌దైన పంథాలో త‌న‌కు బాగా క‌లిసివ‌చ్చి సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాకు ఓ స్వీకెల్ తీయాల‌ని భావించి, క‌థ రాసుకున్నాడు.ఈ కథ‌పై మొద‌ట్నుంచి న‌మ్మ‌కం ఉంచిన నాగార్జున సినిమా తీసేందుకు మాత్రం తొంద‌ర‌ప‌డ‌లేదు.డైరెక్ట‌ర్ సీన్లు రాసేందుకు మాత్రం చాలా టైం ఇచ్చారు.అదేవిధంగా ఆ రోజు ఆయ‌న చాలా ఇబ్బందుల్లో కూడా ఉన్నారు.సొంత సోద‌రుడ్ని కోల్పోయి ఓ విధం అయిన విషాదంలో ఉన్నారు.సినిమా ఫీల్డ్ నే వ‌దిలేద్దాం అని అనుకున్నారు.ఆఖ‌రికి నాగ్ ప్రోత్సాహంతోనే ఈ సినిమా ప‌ట్టాలెక్కింది. మంచి సినిమాకు మంచి ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: