అక్కినేని నాగార్జున తన ఇద్దరు కుమారులు అయిన
నాగ చైతన్య మరియు అఖిల్‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా చైతూతో కలిసి బంగార్రాజు అనే సినిమా కూడా చేశాడు.

ఈ చిత్రం జనవరి 14న విడుదల అయింది.నాగార్జున నటిస్తున్న మరో మూవీ 'ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతుంది.ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నట్లు సమాచారం . కొంత మేరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

నిజానికి ఈ చిత్రంలో ముందుగా డార్లింగ్ కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమె గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది.. ఆమెకు ప్రెగ్నెన్సీ రావడంతో ఆమె ఘోస్ట్ నుంచి అర్దాంతరంగా తప్పుకుంది. దీంతో కాజల్ స్థానంలో బోల్డ్ బ్యూటీ అయిన అమలాపాల్ పేరు పరిశీలనలోకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుందని తెలుస్తుంది.ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ని మేకర్స్ రిలీజ్ చేశారట.. ఇందులో నాగార్జున కత్తిపట్టుకుని క్లీన్ షేవ్ తో హత్యలు చేస్తూ కనిపిస్తాడని కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఈ మూవీలో నాగార్జున సరికొత్త గెటప్ లో మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్ తో కనిపించబోతున్నారని సమాచారం..

 
రిటైర్డ్ రా ఏజెంట్ గా నాగ్ నటిస్తున్న ఈ మూవీలో ఆయన పాత్ర ఇదేనంటూ గుబురు మీసాలు గడ్డంతో కనిపిస్తున్న నాగార్జున స్టిల్ ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మేకర్స్ వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే మరి . అనైక సురేంద్రన్, గుల్ పనాగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

నాగార్జున నటించిన బంగార్రాజు చిత్రం ప్రస్తుతం జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుకుంటుందట.ఇందులో తన తనయుడితో నాగ్ చేసే సందడి మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాపై చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. నాగ్ ఈ సినిమాతో హిట్ కొడితే అదే జోరుతో వరుస సినిమాలు చేయనున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: