సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా విడుదలయ్యి ఈ రోజుకి సరిగ్గా 19 సంవత్సరాలు పూర్తి కావస్తోంది.. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ ని బాగా హైప్ చేసిందని చెప్పవచ్చు.మహేష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు ఈ సినిమాతో.. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ ఒక్కడు సినిమా ఒక బ్లాక్ బాస్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు.. మహేష్ రాజ కుమారుడు తో సక్సెస్ అందుకుని మురారి తో నటుడిగా పేరు పొందాడు.ఇక ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అది అంతగా సక్సెస్ కాలేకపోయాయి.

మహేష్ బాబు పరిస్థితి చాలా దీనమైన స్థితిలో ఉన్నప్పుడు గుణశేఖర్ తో కలిసి ఒక్కడు సినిమా చేసి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. జనవరి 15న 2003 లో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం ప్లస్ అయింది. ఇందులో కథానాయికగా భూమిక నటించింది. ప్రకాష్ రాజ్ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఈ సినిమాకి పోటీగా వచ్చిన నాగ, ఈ అబ్బాయి చాలా మంచోడు, పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాలు విడుదల కాగా ఇందులో రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

మహేష్ బాబు ఒక్కడు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్ల రూపాయలు జరగగా.. ఓవరాల్ గా ఈ సినిమా కలెక్షన్ల.. విషయానికి వస్తే..21.70 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో బయ్యర్లకు ఏకంగా రూ. 10 కోట్ల లాభం వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ లోనే హైయెస్ట్ కలెక్షన్లలో 4 స్థానంలో నిలిచింది. ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కు కథను సిద్ధం చేస్తున్నట్లు గా ప్రకటించడం జరిగింది. అయితే ఇంత వరకు టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: