అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ మళ్ళీ రావా సినిమాతో ఫాం లోకి వచ్చినట్టు అనిపించగా ఆ తర్వాత మళ్లీ సినిమాలైతే చేస్తున్నాడు కానీ అతనికి లక్ కలిసి రావట్లేదు. ప్రస్తుతం సుమంత్ మళ్ళీ మొదలైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టీజీ కీర్తి కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో కష్టాలు కథాంశంతో తెరకెక్కించారు. సినిమాలో సుమంత్ తో నైనా గంగూలి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఢీ యాంకర్ వర్షిణి కూడా నటిస్తుంది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం థియేటర్లో రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అందుకే అక్కినేని హీరో సినిమాని ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేస్తున్నట్టు టాక్. దాదాపు మేకర్స్ మళ్ళీ మొదలైంది సినిమాని ఓటీటీ రిలీజ్ కే మొగ్గు చూపిస్తున్నారట. సుమంత్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏమంత ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు. అందుకే మళ్ళీ మొదలైంది సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేస్తే నిర్మాతలు సేఫ్ అవ్వొచ్చని భావిస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా సుమంత్ అనగనగా ఒక రౌడీ సినిమా చేస్తున్నాడు. అయితే మళ్ళీ మొదలైంది సినిమా ఓటీటీకి వచ్చినా సరే అనగనగా రౌడీ మాత్రం ఖచ్చితంగా థియేట్రికల్ రిలీజ్ కే ఓటు వేస్తున్నారట. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే వరుస సినిమాలు చేస్తున్నాడు సుమంత్. మరి రిలీజ్ ఎక్కడైనా సరే సుమంత్ తన సినిమాతో సత్తా చాటుతాడో లేదో చూడాలి. కెరియర్ లో ఓ సూపర్ హిట్ కోసం చూస్తున్న సుమంత్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే ఏది వర్క్ అవుట్ అవట్లేదు. మరి రాబోతున్న సినిమాలైనా సరే సుమంత్ కి హిట్ ఇస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: