నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంతా కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది సమంత. ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి సెన్సేషన్ సృష్టించింది సమంత. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి అటు సమంత ఐటమ్ సాంగ్ ఎంతో కలిసి వచ్చింది అని చెప్పాలి. ఊ అంటావా ఉహూ అంటావా అంటూ ఎంతో రొమాంటిక్గా సాగిపోయే సాంగ్ లో సమంత నటించడంతో ఈ సాంగ్కి మరింత క్రేజ్ ఏర్పడింది. దీంతో తెలుగు ప్రేక్షకులందరికీ ఈ పాట ఎంతగానో ఆకర్షించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాట వినిపిస్తుంది. చిన్న ల నుంచి  పెద్దల వరకు అందరిని ఈ పాట ఆకర్షిస్తుంది. ఇక బుల్లితెరపై కూడా సెలబ్రిటీలు ఈ పాటపై హాట్ పర్ఫామెన్స్ లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే సాధారణంగా ఊ అంటావా ఉహూ అంటావా పాట వింటుంటే కిక్కేక్కి పోతు ఉంటుంది.  అలాంటిది అందులో సమంత నటించడం.. ఎంతో కసి కసి గా ఉండే చూపులతో డాన్స్ పర్ఫామెన్స్ చేయడంతో ఈ పాట చూసిన తర్వాత ప్రేక్షకులందరికీ పిచ్చెక్కి పోయింది అని చెప్పాలి. ఇక ఊహించిన దానికంటే ఈ పాట సెన్సేషనల్ హిట్గా నిలిచింది.


 అయితే ఈ ఐటెం సాంగ్ లో నటించడానికి ఒప్పుకోడానికి గల కారణం ఏమిటి అన్న విషయాన్ని సమంత ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొదట ఈ పాటలో డాన్స్ చేయడానికి ఒప్పుకోలేదని కానీ ఆ తర్వాత బన్నీ మద్దతుగా నిలిచి ఈ పాటలో నటిస్తే మంచి గుర్తింపు అని చెప్పడంతో పాట చేయడానికి ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా కేవలం ఈ ఒక్క ఐటం సాంగ్ కోసమే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. సమంత రెమ్యూనరేషన్ అదే రేంజ్ లో ఉండటం గమనార్హం.   మూడు నిమిషాలు ఐటమ్ సాంగ్ చేసేందుకు 5 కోట్లు డిమాండ్ చేయగా.. ప్రొడ్యూసర్లు  కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: