టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ప్రస్తుతం విలన్ల కొరత బాగా వేధిస్తోంది. బలమైన ప్రతినాయకుల పాత్రల్లో నటించే విషయంలో చాలామంది విలన్లు అసలు పూర్తిగా తేలిపోతున్నారు.ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇంకా జగపతి బాబు ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాల్లో విలన్లుగా నటించడంతో టాలీవుడ్ దర్శకులు ఇతర ఇండస్ట్రీల విలన్లపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. అల వైకుంఠపురములో ఇంకా క్రాక్ సినిమాల హిట్స్ తో సముద్రఖని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ఆయన రేంజ్ ని కూడా పెంచుకున్నారు. ప్రస్తుతం ఈ నటుడికి తెలుగులో ఊహించని స్థాయిలో మాంచి డిమాండ్ అనేది ఉంది.అయితే ఈ నటుడు రోజుకు 7 లక్షల రూపాయల చొప్పున సినిమాలకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమచారం తెలుస్తుంది. తమిళంలో సముద్రఖనికి అంతగా క్రేజ్ లేదు. అయితే తెలుగులో మాత్రం ఈ ఈయనకి ఊహించని స్థాయిలో డిమాండ్ అనేది ఉంది.

మన తెలుగు నటులతో బేరాలు సాగిస్తున్న నిర్మాతలు సముద్రఖనికి మాత్రం అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం తెలుస్తోంది. తెలుగులో సక్సెస్ తో పాటు మంచి గుర్తింపు కూడా ఉండటం సముద్రఖనికి బాగా ప్లస్ అవుతోంది. సముద్రఖని తెలుగులో నటిస్తున్న సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో ప్రొడ్యూసర్లు కూడా ఆయన అడిగినంత భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో పాటు శంకర్ చరణ్ కాంబో మూవీలో సముద్రఖని నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో సముద్రఖనికి డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు అనేది ఉంది. అయితే కొంతమంది మాత్రం తెలుగులో టాలెంట్ ఉన్న ఎంతోమంది నటులు ఉన్నారని పరభాషా నటులకు ఎక్కువ మొత్తం డబ్బులు ఇచ్చి సినిమాలలో తీసుకోవడానికి బదులుగా తెలుగు భాషా నటులకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: